మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy)..అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసారు. నల్లగొండ పట్టణం నడిబొడ్డున.. అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ నిర్మించారని, ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చివేయాలంటూ అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. నేను అమెరికాకు వెళ్తున్నా.. ఆగస్టు 11న తిరిగి వస్తాను.. వచ్చేలోపు అనుమతి లేని ఆ పార్టీ కార్యాలయం నేలమట్టం కావాలి లేకపోతే. అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి అధికారులకు సంచలన ఆదేశాలు జారీ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
శనివారం మున్సిపల్ కేంద్రంలో అదనపు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి విచ్చేసిన సందర్భంగా మంత్రి అధికారులతో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని మంత్రి ఆరోపించారు. రూ. 100 కోట్లు విలువైన ప్రభుత్వ స్థలంలో.. పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్‌ను తక్షణమే కూల్చేయాలనీ.. మున్సిపల్ కమిషనర్ ను మంత్రి ఆదేశించారు. పేదవాడు సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే సవాలక్ష రూల్స్ పెడుతున్న అధికారులు.. రూ. 100 కోట్ల విలువైన భూమిలో అనుమతి లేకుండా ఇంద్ర భవనం లాంటి పార్టీ ఆఫీస్ కడుతుంటే ఏం చేస్తున్నారని కోమటిరెడ్డి ప్రశ్నించారు.
Read Also : Garuda Panchami : సర్పదోషం పోవాలంటే.. గరుడ పంచమి రోజు చేయాల్సిన పూజలివీ