Komatireddy & Jaggareddy: టీకాంగ్రెస్ కు విందుకు కోమటిరెడ్డి, జగ్గారెడ్డి డుమ్మా!

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి)లో విభేదాలను తొలగించడానికి కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నిస్తుండగా,

  • Written By:
  • Updated On - July 11, 2022 / 05:30 PM IST

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి)లో విభేదాలను తొలగించడానికి కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నిస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ నాయకులు మాత్రం నువ్వానేనా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. టీపీసీసీ కమిటీకి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆదివారం గ్రాండ్ ఓల్డ్ పార్టీ రాష్ట్ర శాఖ వివిధ అంశాలపై నేతలు ఏకాభిప్రాయ కోసం  విందు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే, టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టీ జయప్రకాష్ రెడ్డి మరోసారి చర్చనీయాంశంగా మారారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఏడాది టీపీసీసీ కమిటీ వార్షికోత్సవానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ నేతలు రేణుకా చౌదరి, మధు యాష్కీ హాజరయ్యారు.

హాజరైన వారిలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు డి శ్రీధర్ బాబు, దానసరి అనసూయ, రేణుకా చౌదరి, గీతారెడ్డి, దామోదర్ రాజ నరసింహ, ఎస్ ఏ సంపత్ ఉన్నారు. డి శ్రావణ్, ఇతర సీనియర్ నాయకులు ఉన్నారు. కానీ విందుకు కోమటిరెడ్డి, జగ్గారెడ్డి అటెండ్ కాకపోవడం చర్చనీయాంశమైంది. అయితే ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ ఓట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని సునీల్ కనుగోలు సర్వేలో వెల్లడైంది. సునీల్ నివేదికపై మాణిక్యం ఠాగూర్ రేవంత్‌తో సమావేశమయ్యారు.