Site icon HashtagU Telugu

CM Candidate : సీఎం ఎవరైనా.. కార్యకర్తలకు బెడ్ రూమ్ లోకి వెళ్లేంత స్వేచ్ఛ : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Cm Candidate

Cm Candidate

CM Candidate : తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థిని తానేనని ప్రకటించారు. కాంగ్రెస్ లో ఎవరు సీఎం అయినా ప్రజలకు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. కార్యకర్తలు.. సీఎం బెడ్ రూమ్ లోకి వెళ్లే అంత స్వేచ్ఛ ఉంటుందని కామెంట్ చేశారు. నకిరేకల్ లో వేముల వీరేశం ను గెలిపించాలని ఆ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.

Also read : Good News : అంగన్‌వాడీలకూ పీఆర్సీ.. తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం

ఇటీవల ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం.. ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని నివాసానికి వెళ్లి సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో భేటీ అయ్యారు. వీరేశం కాంగ్రెస్ లోకి చేరే  సమయంలో కోమటిరెడ్డి అందుబాటులో లేరు. దీంతో ఇవాళ వీరేశం స్వయంగా వెళ్లి కోమటిరెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తనకు నకిరేకల్ అసెంబ్లీ టికెట్ దక్కితే.. గెలుపునకు సహకరించాలని కోరారు. కోమటిరెడ్డితో భేటీ అనంతరం వేముల వీరేశం మాట్లాడుతూ.. ‘‘కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆశీస్సులతో ముందుకు వెళ్తా. పార్టీ లోకి కూడా  కోమటిరెడ్డి (CM Candidate) ఓకే అంటేనే వస్తానని చెప్పాను. ఆయన ఓకే అన్నాకే వచ్చాను. ఈ రోజు నుంచి  కోమటిరెడ్డితో కలిసి పని చేస్తా’’ అని తెలిపారు.