Site icon HashtagU Telugu

Komati Reddy Venkat Reddy : త్వరలోనే గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తాం

Kvr

Kvr

ఏపీ(AP)లో అమలులో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ (Volunteer System)ను తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దమైన సంగతి తెలిసిందే. పార్లమెంటు ఎన్నికల తర్వాత దాదాపు 36,000 మంది వాలంటీర్లను నియమించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. వీరిని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలను ప్రచారం చేయడమే కాకుండా లబ్ధిదారులకు సామాజిక భద్రతా పింఛన్లు, ఇతర సంక్షేమ ప్రయోజనాలను పంపిణీ చేయడం వంటి బాధ్యతలు అప్పగించనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ వాలంటీర్లకు గౌరవ వేతనం ప్రభుత్వం చెల్లించనుంది. ప్రతిభావంతులైన పార్టీ కార్యకర్తలను గుర్తించి, వారికి వాలంటీర్ ఉద్యోగాన్ని అప్పగించడం ద్వారా, ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను అట్టడుగు స్థాయికి సులభంగా చేరవేయవచ్చు అని పార్టీ భావిస్తుంది. సామాజిక భద్రతా పింఛన్లు మరియు ప్రజలకు వచ్చే ఇతర ప్రయోజనాలను పంపిణీ చేయడానికి కూడా ముసాయిదా రూపొందించబడుతుంది.

తాజాగా ఇదే విషయమై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మీడియా తో తెలిపారు. రాష్ట్రంలోని గ్రామాలు, మున్సిపాలిటీల్లో త్వరలోనే వాలంటీర్ వ్యవస్థను తీసుకువస్తామని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఆగస్ట్ 15లోగా రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించారు. తెలంగాణలో ప్రస్తుతం ఏర్పడ్డ నీటి కరువుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటేస్తే మూసీలో వేసినట్లేనని ఎద్దేవా చేశారు. తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థను తీసుకువస్తామని కోమటిరెడ్డి చెప్పడంతో పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Read Also : PM Kisan Rejection: పీఎం కిసాన్ నిధి యోజన దరఖాస్తు తిరస్కరణకు కారణాలివే..!