TS Politics:ఈ సర్వే రిపోర్ట్ వల్లే కోమటిరెడ్డి బీజేపీలోకి వెళ్లే ఆలోచన మానుకున్నారట

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. తాను కాషాయ కండువా కప్పుకోవడానికి అంతా సిద్ధం చేసుకున్నారని చేరడమే మిగిలిందని ఆయన మాటలే చెప్పాయి. కానీ ఏమైందో ఏమో రాజగోపాల్ రెడ్డి మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకొని కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతున్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. తాను కాషాయ కండువా కప్పుకోవడానికి అంతా సిద్ధం చేసుకున్నారని చేరడమే మిగిలిందని ఆయన మాటలే చెప్పాయి. కానీ ఏమైందో ఏమో రాజగోపాల్ రెడ్డి మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకొని కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతున్నారు.

పీసీసీ చీఫ్ గా తన అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని నియమించాలని లేకపోతే పార్టీ మారుతానని అప్పట్లో రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. అదేసమయంలో తాను ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు తెలంగాణాలో బీజేపీ హవా నడుస్తోందని, తాను బీజేపీలోకి వెళ్తున్నట్లు పరోక్షంగా ప్రకటించారు.

ఇక చాల రోజులనుండి కాంగ్రెస్ కార్యక్రమాలకు కోమటిరెడ్డి బ్రదర్స్ దూరంగానే ఉన్నారు. అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ రెండురోజుల పాటు ధర్నా చౌక్ లో చేసిన వరిదీక్ష కు దాదాపు అన్నీతానై వ్యవహరించారు. ఇక ఆ కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి కుడా పాల్గొనేవాడని, తన కుమారుడి పెళ్లి ఉన్న కారణంగానే రాజగోపాల్ రెడ్డి పాల్గొనలేదని కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు.

రాజగోపాల్ రెడ్డి బీజేపీ లో చేరడానికి ఢిల్లీదాక వెళ్లినట్లు సమాచారం. అయితే. ఆ సమయంలో రాజగోపాల్ ఒక కార్యకర్తతో మాట్లాడుతూ బీజేపీలో తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని చెప్పుకోవడం, ఆ ఆడియో లీకవడంతో పెద్దదుమారం రేగి రాజగోపాల్ చేరిక ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి.

అయితే రాజగోపాల్ ఇక పొరపాటున కూడా బీజేపీలో చేరడని, కాంగ్రెస్ ని వదిలే ప్రసక్తే లేదని తెలుస్తోంది. దీనికి గల కారణాలపై కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డికి వ్యక్తిగత ఇమేజ్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ కి రిజైన్ చేసి బీజేపీ నుండి పోటీ చేస్తే తనకి కేవలం 18 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని ఒక ఇంటర్నల్ సర్వే రాజగోపాల్ రెడ్డికి తేల్చి చెప్పిందట. ఇక ఇదే నిజమైతే రాజగోపాల్ రెడ్డి కొన్ని రోజుల్లోనే కాంగ్రెస్ కార్యక్రమంలో మళ్ళీ యాక్టివ్ గా కనిపించే అవకాశముంది.