Komati reddy Media : కాంగ్రెస్ కు సొంత మీడియా, కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఆధ్వ‌ర్యంలో..?

కాంగ్రెస్ లో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కు ఉన్న ఇమేజ్ ను(Komati reddy Media) ఎవ‌రు చెర‌ప‌లేరు. గ‌త నాలుగు ద‌శాబ్దాలుగా వాళ్ల బ్రాండ్ కాంగ్రెస్.

  • Written By:
  • Publish Date - June 21, 2023 / 03:06 PM IST

కాంగ్రెస్ పార్టీలో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కు ఉన్న ఇమేజ్ ను(Komati reddy Media) ఎవ‌రు చెర‌ప‌లేరు. గ‌త నాలుగు ద‌శాబ్దాలుగా వాళ్ల బ్రాండ్ కాంగ్రెస్. అనూహ్య ప‌రిణామాల న‌డుమ రాజ‌గోపాల్ రెడ్డి ఆ పార్టీని వీడారు. కానీ, వెంక‌ట‌రెడ్డి మాత్రం కాంగ్రెస్ ను వీడలేక‌పోయారు. ఒక వైపు త‌మ్ముడు మ‌రో వైపు పార్టీ మ‌ధ్య కొన్ని నెల‌ల పాటు న‌లిగిపోయారు. ఆ సంద‌ర్భంగా కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ప‌డిన బాధ వ‌ర్ణ‌నాతీతంగా వాళ్ల గురించి తెలిసిన వాళ్లు చెబుతుంటారు. విధిలేని ప‌రిస్థితుల్లో మొఖంచాటేసి విదేశాల‌కు వెళ్లిన కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి మ‌న‌సు మాత్రం కాంగ్రెస్ చుట్టూ తిరిగింది. ఆ క్ర‌మంలో కుటుంబీకుల నుంచి ఆయ‌న‌పై వ‌చ్చిన ఒత్తిడి సోనియా కుటుంబానికి మాత్ర‌మే తెలుసు.

కాంగ్రెస్ పార్టీలో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కు ఉన్న ఇమేజ్ ను(Komati reddy Media)

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత సోష‌ల్ మీడియా వేదిక‌గా కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ టార్గెట్ అయ్యారు. కోవ‌ర్టులుగా వాళ్ల‌ను చిత్రీక‌రించారు. కొన్ని రోజులు కేసీఆర్ కోవ‌ర్టులుగా ఫోక‌స్ చేశారు. మ‌రికొన్ని రోజులు బీజేపీ కోవ‌ర్టులుగా ప్ర‌చారం చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడివెళ్ల‌బోతున్నార‌ని ర‌చ్చ చేశారు. విసుగెత్తిన రాజ‌గోపాల్ రెడ్డి సంయ‌మ‌నం కోల్పోయారు. మునుగోడు అభివృద్ధి కోసం అంటూ నినదిస్తూ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లారు. స‌రిగ్గా అదే, రేవంత్ రెడ్డి వ‌ర్గీయులు కొంద‌రి టార్గెట్‌. ఆ త‌రువాత కోమ‌టిరెడ్డి బ్రాండ్ మీద దెబ్బ‌కొడుతూ వెంక‌ట‌రెడ్డిని టార్గెట్ చేశారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా రచ్చ చేసిన వాళ్ల‌ను వెంక‌ట‌రెడ్డి ప‌సిగ‌ట్టారు. అదే విష‌యాన్ని అధిష్టానంకు చేర‌వేశారు. ఆ రోజు నుంచి కుటుంబం ద‌గ్గ‌ర‌ నుంచి పార్టీలోని అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల‌ను వ‌ర‌కు న‌మ్మిన‌బంటుగా చేర‌వేస్తున్నారు. అందుకే, సోనియా కుటుంబం కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కు (Komati reddy Media)ప్రాధాన్యం ఇస్తోంది.

ఒక శాటిలైట్ ఛాన‌ల్ తో పాటు కొన్ని యూట్యూబ్ ఛాన‌ల్స్ ను తీసుకోవ‌డానికి

కాంగ్రెస్ పార్టీని రాబోవు రోజుల్లో అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని చాలా కాలం నుంచి వెంక‌ట‌రెడ్డి చెబుతున్నారు. ప్ర‌ధాన మంత్రిగా రాహుల్ గాంధీని చూడాల‌ని కోరుకున్నారు. ఆనాడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఏదైతే అనుకున్నారో, దాన్ని నెర‌వేర్చాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల‌ను భుజాన. వేసుకోవ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. స్టార్ క్యాంపెయిన‌ర్ గా ఆయ‌న లీడ్ చేయ‌బోతున్నారు. ఆ లోపుగా అంత‌ర్గ‌త శ‌త్రువుల సంగ‌తి చూడాల‌ని కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఆలోచించార‌ట‌. మీడియాను స్థాపించ‌డం ద్వారా ప్ర‌త్య‌ర్థుల‌ను మ‌ట్టు క‌రిపించ‌డానికి అనువుగా ఉంటుంద‌ని భావించార‌ట‌. ఆ క్ర‌మంలో ఒక శాటిలైట్ ఛాన‌ల్ తో పాటు కొన్ని యూట్యూబ్ ఛాన‌ల్స్ ను తీసుకోవ‌డానికి (Komati reddy Media) ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని తెలుస్తోంది. గ్రౌండ్లో ఇప్ప‌టికే రాజ‌గోపాల్ రెడ్డి ఆ ప‌నిలో ఉన్నార‌ని మీడియా వ‌ర్గాల్లోని టాక్‌.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కొన్ని యూ ట్యూబ్ ఛాన‌ల్స్ అనుకూలంగా

ప్ర‌స్తుతం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కొన్ని యూ ట్యూబ్ ఛాన‌ల్స్ అనుకూలంగా ఉన్నాయి. స్నేహితుల ద్వారా ఒక న్యూస్ ఛాన‌ల్ ను కూడా పెట్టించార‌ని తెలుస్తోంది. రాబోవు రోజుల్లో అటు సోషల్ ఇటు శాటిలైట్ ఛాన‌ల్ ద్వారా అంత‌ర్గ‌తంగా ఉన్న ప్ర‌త్య‌ర్థుల‌ను ఖ‌తం చేసే ప‌నిలో ఉన్నార‌ని కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కు ఉన్న స‌మాచార‌మ‌ట‌. దానికి ఇటీవ‌ల జ‌రిగిన సంఘ‌ట‌న ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తున్నార‌ని పార్గీ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. ఇటీవ‌ల ఉత్త‌మ్ మీద వ్య‌తిరేకంగా కొన్ని పోస్ట్ లు సోల‌ష్ మీడియా వేదిగా హ‌ల్ చ‌ల్ చేశాయి. ఆ క్ర‌మంలోనే రేవంత్ రెడ్డి అండ‌ర్ లో న‌డుస్తోన్న డేటా సెంట‌ర్ మీద తెలంగాణ పోలీసులు రైడ్ చేశారు. అక్క‌డ నుంచి ఉత్త‌మ్ రెడ్డికి వ్య‌తిరేకంగా పోస్ట్ లు వ‌చ్చాయ‌ని పోలీసులు నిర్థారించారు. ఆ విష‌యాన్ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మీడియాకు చెప్ప‌డం జ‌రిగింది. ఇలాంటి పోస్ట్ లు రాబోవు రోజుల్లో కాంగ్రెస్ లోని అంత‌ర్గ‌త ప్ర‌త్య‌ర్థుల‌పై రేవంత్ అనుచ‌రులు కొంద‌రు చేస్తార‌ని కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ అనుమానం. అందుకే, విరుగుడుగా సొంత మీడియాను(Komati reddy Media) క్రియేట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.

Also Read : Komatireddy Brothers: తమ్ముడి ఘర్ వాపసికి అన్న ప్రయత్నం!

ప్ర‌స్తుతం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న సోష‌ల్ , శాటిలైట్ ఛాన‌ల్ కేవ‌లం ఆయ‌న వ్య‌క్తిగ‌త ఇమేజ్ ను పెంచేలా ఫోక‌స్ పెట్టాయ‌ని కాంగ్రెస్ వ‌ర్గాల్లోని టాక్‌. అందుకే, సొంత మీడియా పెట్ట‌డం ద్వారా కాంగ్రెస్ ఇమేజ్ ను పెంచాల‌ని కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ అడుగులు వేస్తున్న‌ట్టు స‌మాచారం. గ‌తంలో ఒక శాటిలైట్ ఛాన‌ల్ ను లీజుకు తీసుకుని రాజ‌గోపాల్ రెడ్డి న‌డిపారు. సుదీర్ఘ కాలం న‌డిపిన త‌రువాత రెండేళ్ల క్రితం వ‌దిలేశారు. మ‌ళ్లీ దాన్ని తీసుకోవ‌డ‌మా? లేక ప్ర‌స్తుతం ఉన్న ఛాన‌ళ్ల‌లో ఏదో ఒక‌టి లీజుకు తీసుకోవ‌డ‌మా? అనే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు మీడియా వ‌ర్గాల్లోని వినికిడి. అంతేకాదు, సొంత మీడియా అవ‌స‌రం గురించి ఇటీవ‌ల ప్రియాంకను క‌లిసిన వెంక‌ట‌రెడ్డి ప్ర‌త్యేకంగా చెప్పార‌ని ఢిల్లీ వ‌ర్గాల స‌మాచారం. అంతేకాదు, రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలోని కొన్ని సోష‌ల్ మీడియా గ్రూపులు, యూట్యూబ‌ర్స్ చేస్తోన్న ర‌చ్చ‌ను కూడా ప్ర‌స్తావించార‌ట‌. కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ను పెంచేలా మీడియా స్థాపించడానికి  (Komati reddy Media) అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింద‌ని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో రాజ‌గోపాల్ రెడ్డి చేరేలోపుగా సొంత మీడియా వ‌స్తుంద‌ని కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ అనుచ‌రులు చెప్పుకోవ‌డం గ‌మ‌నార్హం.

Also Read : T Congress : తెలంగాణ కాంగ్రెస్‌పై కర్ణాట‌క లీడ‌ర్ల ఫోక‌స్‌.. సీఎల్పీ నేత పాద‌యాత్ర‌పై క‌ర్ణాట‌క సీఎం ఆరా.. !