Site icon HashtagU Telugu

Komati Reddy : హంగ్ త‌రంగ్ ! కోమ‌టిరెడ్డి దుమారం! సంకీర్ణ CM ఎవ‌రు?

Komati Reddy

Komati Reddy

కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి (Komati Reddy) చేసిన హంగ్ వ్యాఖ్య‌లు తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. అన్ని పార్టీల‌ను ఆయ‌న వ్యాఖ్య‌లు ట‌చ్ చేశాయి హంగ్(Coalition) అసెంబ్లీ ఏర్ప‌డితే, రాబోవు రోజుల్లో సీఎం ఎవ‌రు? అనే అంశంపై చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం రాజ‌కీయ తెర‌మీద కాబోయే సీఎంలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి, బీజేపీ నుంచి బండి సంజ‌య్, బీఆర్ ఎస్ పార్ట నుంచి కేటీఆర్ ప్ర‌ముఖంగా క‌నిపిస్తున్నారు. సింగిల్ గా ఆయా పార్టీలు గెలిస్తే వాళ్ల కోర్కె తీరే అవకాశం ఉంది. కానీ, హంగ్ ఏర్ప‌డితే మాత్రం ఎండ‌మావిగా సీఎం ప‌దవి వాళ్ల‌కు మిగ‌ల‌నుంది.

కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి  చేసిన హంగ్ వ్యాఖ్య‌లు ..(Komati Reddy) 

ప్ర‌స్తుతం కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి(Komati Reddy)  చేసిన వ్యాఖ్య‌లు కాంగ్రెస్ పార్టీని రాజ‌కీయంగా అల్ల‌క‌ల్లోలం చేస్తున్నాయి. పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి రేవంత్ రెడ్డి ఒక వైపు పాద‌యాత్ర చేస్తున్నారు. హాత్ సే హాత్ జోడో యాత్ర చేస్తూ ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌వుతున్నారు. ఖ‌మ్మం జిల్లా భ‌ద్రాద్రి వ‌ర‌కు వెళ్లిన ఆయ‌న యాత్ర ప్ర‌జాశీస్సుల‌ను అందుకుంటోంది. ఇదే ఒర‌వ‌డితో రాష్ట్రాన్ని చుట్టేస్తే 2004లో వైఎస్ త‌ర‌హాలో 2023లో రేవంత్ సీఎం అభ్య‌ర్థిగా ఫోక‌స్ అవుతారు. ఆయ‌న అభిమానుల్లో కూడా ఇలాంటి ఆశే ఉంది. కానీ, తాజాగా కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి చేసిన హంగ్ (Coalition)వ్యాఖ్య‌లు నిజ‌మైతే, రేవంత్ రెడ్డి అభ్య‌ర్థిత్వాన్ని బీఆర్ఎస్ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అంగీక‌రించ‌దు. ఎందుకంటే, క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి, రేవంత్ రెడ్డికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డేస్తే భ‌గ్గ‌మ‌నే రాజ‌కీయం న‌డుస్తోంది. ప్ర‌త్యామ్నాయంగా వెంక‌ట‌రెడ్డి అభ్య‌ర్థిత్వాన్ని కాంగ్రెస్ అధిష్టానం ప‌రిశీలిస్తుంద‌ని ఆయ‌న అభిమానుల ఉవాచ‌. లేదంటే, కాంగ్రెస్ శాస‌న స‌భాప‌క్ష నేత‌గా ఉన్న భ‌ట్టి విక్ర‌మార్క్ పేరు తెర‌మీద‌కు వ‌చ్చే ఛాన్స్ ఉంది. అంటే, రేవంత్ రెడ్డికి అంద‌ని ద్రాక్ష‌గానే సీఎం ప‌ద‌వి మిగల‌నుంది.

Also Read : Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి కొత్త డిమాండ్.. అనుచర వర్గానికి పీసీసీ పోస్టులు?

హంగ్ అసెంబ్లీ ఏర్ప‌డితే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ లేదా కేటీఆర్ అభ్య‌ర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అంగీక‌రించ‌డానికి ఛాన్స్ త‌క్కువ‌. అలాంటి సందర్భాల్లో హ‌రీశ్ రావు పేరు మ‌ధ్యే మార్గంగా తెర‌మీద‌కు రానుందని రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా. అంటే, కాబోయే సీఎంగా ఫోక‌స్ అవుతోన్న కేటీఆర్ కు కూడా ఆ ప‌ద‌వి అంద‌ని ద్రాక్ష‌గా మార‌నుంది. ఒక వేళ సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని (Coalition)ఏర్పాటు చేయాల్సి వ‌స్తే బీజేపీ నుంచి బండి సంజయ్ పేరు వెన‌క్కు వెళ్లే ఛాన్స్ ఉంది. ప్ర‌స్తుతం బీజేపీ అధ్యక్షునిగా బండి సంజ‌య్ కొన‌సాగుతున్నారు. ఆయన మీద వ్య‌తిరేక గ్రూప్ అంత‌ర్గ‌తంగా ప‌నిచేస్తోంది. అందుకే, మ‌ధ్యేమార్గంగా ఈటెల రాజేంద్ర పేరు సీఎం అభ్య‌ర్థిగా ఫోక‌స్ కావ‌డానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. లేదంటే, కిష‌న్ రెడ్డి సంకీర్ణ ప్ర‌భుత్వానికి స‌రైన‌ సీఎం అభ్య‌ర్థిగా బీజేపీ భావించ‌డానికి అవ‌కాశాలు లేక‌పోలేదు. ఒక వేళ త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో బండికి స్థానం ద‌క్కితే, రాబోవు రోజుల్లో కిష‌న్ రెడ్డి రాష్ట్ర రాజ‌కీయాల మీద ప‌ట్టు సాధించ‌నున్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ సంకీర్ణంలోనూ సీఎం అభ్య‌ర్థుల విష‌యంలో..

ప్ర‌స్తుతం వ‌స్తోన్న స‌ర్వేల సారంశం ప్ర‌కారం తెలంగాణ‌లో హంగ్ అసెంబ్లీ ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. అలాంటి ప‌రిస్థితుల్లో బీజేపీకి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఎంఐఎం మ‌ద్ధ‌తు ఇవ్వ‌దు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ కూట‌మితో ఏర్ప‌డిన ప్ర‌భుత్వానికి మాత్ర‌మే అండ‌గా నిల‌బ‌డుతుంది. సెక్యుల‌ర్ పార్టీలు ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ సంకీర్ణంలోనూ(Coalition) సీఎం అభ్య‌ర్థుల విష‌యంలో ఎంఐఎం జోక్యం చేసుకుంటుంది. ఒక వేళ కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీ సీఎం అభ్య‌ర్థిగా సంకీర్ణానికి ఎంపిక చేస్తే ఎంఐఎం స‌హ‌కరించ‌డానికి ముందుకు రాక‌పోవ‌చ్చు. అదే, కేసీఆర్ సీఎం అభ్య‌ర్థి అయితే ఆ పార్టీ అండ‌గా నిల‌వొచ్చు. కానీ, సీఎం అభ్య‌ర్థిగా కేసీఆర్ ఉంటే కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్ర‌భుత్వంలో అంగీక‌రించ‌డానికి త‌క్కువ అవ‌కాశాలు ఉన్నాయి. అందుకే, మ‌ధ్యే మార్గంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ సంకీర్ణానికి హ‌రిశ్ రావు పేరు తెర‌మీద‌కు అనూహ్యంగా రావ‌డానికి అవ‌కాశాలు మెండు.

హంగ్ వ్యాఖ్య‌లు కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తుంటే, ప్ర‌త్య‌ర్థి పార్టీల్లోనూ అల‌జ‌డి..

నిజంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి(Komati Reddy) అంచనా ప్ర‌కారం హంగ్ అసెంబ్లీ ఏర్ప‌డితే సీఎం అభ్య‌ర్థిగా ఇప్పుడు వినిపిస్తోన్న రేవంత్ రెడ్డి, కేటీఆర్, బండి సంజ‌య్ పేర్లు ప‌రిశీల‌న‌లోకి కూడా రాక‌పోవ‌చ్చు. అనూహ్యంగా వివాద‌ర‌హితంగా ఉండే నాయ‌కుల‌కు ఛాన్స్ వ‌స్తుంది. ఆ జాబితాలో హ‌రీశ్ రావు, ఈటెల రాజేంద్ర‌, కిష‌న్ రెడ్డి, భ‌ట్టీ త‌దిత‌రులు ఉండొచ్చు. మొత్తం మీద కోమ‌టిరెడ్డి హంగ్ వ్యాఖ్య‌లు కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తుంటే, ప్ర‌త్య‌ర్థి పార్టీల్లోనూ అల‌జ‌డి రేపింది.

Also Read : Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రవ్యాప్తంగా 100 రాములోరి ఆలయాలు!