గత బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల వల్ల రూ.81 కోట్ల అప్పు అయ్యిందన్నారు ప్రొ. కోదండరాం (Kodandaram). యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంట్ కొనుగోలు ఒప్పందం అంశాలల్లోని అవకతవకలపై ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ నరసింహా రెడ్డిని టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కొదండరామ్ కలిశారు. ఛత్తీస్‌గఢ్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్ వల్ల భారీ నష్టం వాటిల్లిందని జ్యుడిషియల్ కమిషన్‌కు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తెలిపింది. బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకే విద్యుత్ లభిస్తుండగా, ఛత్తీస్‌గఢ్‌కు భారీగా సొమ్ములు చెల్లించాల్సి వచ్చిందని వెల్లడించాయి. 2017 చివర్లో ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరా మొదలైంది. పీపీఏలో ప్రస్తావించినట్టుగా 1000 మెగావాట్లు ఎన్నడూ పూర్తి కాలేదు. బకాయిల చెల్లింపుల వివాదంపై రెండేళ్ల కిందట నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒప్పందం ప్రకారం 2017-2022 వరకు పూర్తి స్థాయిలో కరెంటు రాకపోవడం వల్ల ఓపెన్ మార్కెట్‌లో రెండు వేల కోట్ల పైచిలుకు చెల్లించి విద్యుత్ కొనాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు అందులో వివరించాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్భంగా కొదండరామ్ మీడియాతో మాట్లాడుతూ..విద్యుత్ కొనుగోళ్లలో చాలా తప్పులు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం రూ. 81 వేల కోట్లు అప్పులపాలు చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లలో చాలా సమస్యలు ఉన్నాయని, సహజ న్యాయ సూత్రాలు ఉల్లంఘించిందన్నారు. విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాలకు చాలా ఖర్చు అవుతోందన్నారు. కేసీఆర్ పాలనలో ఆర్థిక నిర్ణయాల విషయంలో కొద్ది మందికి లాభంగా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. కాంట్రాక్టర్లకు లాభం జరిగిందని, కానీ ప్రజలకు తీవ్రంగా నష్టం జరిగిందన్నారు. అక్కరకు రాని టెక్నాలజీని తెలంగాణకు రుద్దీ.. తెలంగాణ ప్రజల నెత్తిన టెక్నాలజీ ఉపయోగించారని మండిపడ్డారు. గత ప్రభుత్వం చట్టాన్ని, రాజ్యాంగ నీతిని తుంగలో తొక్కిందన్నారు.
Read Also : Jagan : రేపు పులివెందులకు వైస్ జగన్