Site icon HashtagU Telugu

KTR : రాజ్యసభ సభ్యత్వానికి కేశవరావు రాజీనామా..స్వాగతించిన కేటీఆర్

Ktr (2)

సీనియర్ రాజకీయ నేత, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు (K. Keshava Rao ) కాంగ్రెస్ (Congress) పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. బుధువారం సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆయన.. తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్‌మున్షీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఖర్గే. అయితే తన రాజ్యసభ సభ్యత్వానికి గురువారం కేకే రాజీనామా సమర్పించారు. ఈ మేరకు ఆయన రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌కు రాజీనామా అందజేశారు. 2020 సెప్టెంబర్‌లో కేకే రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక కేకే రాజీనామాను బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. అయితే బీఆర్ఎస్ టిక్కెట్‌పై పోటీ చేసి కాంగ్రెస్‌లో చేరిన పలువురు ఎమ్మెల్యేల సంగతి ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టిక్కెట్‌పై గెలిచిన దాదాపు అరడజను మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. మరి ఆ ఎమ్మెల్యేల సంగతి ఏమిటని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని నిలబెడదామని రాహుల్ గాంధీ చెబుతున్నారని… కానీ ఇలా రాజ్యాంగాన్ని నిలబెడతారా? అని నిలదీశారు.

సార్వత్రిక ఎన్నికల సమయంలో ఫిరాయింపులకు అవకాశం లేకుండా పదో షెడ్యూల్‌ను సవరిస్తామని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా మీరు దేశానికి ఏం సందేశం ఇస్తున్నట్లు? ఈ దేశం మిమ్మల్ని ఎలా విశ్వసిస్తుంది? అని ప్రశ్నించారు. మీరు చెప్పినట్లుగా ఇది ‘న్యాయ పత్రం’ ఎలా అవుతుందో చెప్పాలన్నారు.

Read Also : PM Modi – CM Revanth : ప్రధాని వద్ద సీఎం రేవంత్ చర్చించిన అంశాలు ఇవే..