Site icon HashtagU Telugu

KK : ప్రత్యేక తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ ఎంపీలే – కేకే

Kk Brs

Kk Brs

బిఆర్ఎస్ (BRS) పార్టీ కి గుడ్ బై చెప్పి..కాంగ్రెస్ లో చేరుతున్న సీనియర్ నేత కేకే (KK) ..బిఆర్ఎస్ పార్టీ ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్న KK ఈరోజు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో 30 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ కూడా పాల్గొన్నారు. రేపు కేశవరావు, గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇదిలా ఉంటె బిఆర్ఎస్ పార్టీ ఫై , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫై కేకే కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర ఏర్పాటు పాటలు పాడినందుకో, డాన్సులు చేస్తేనో, ధర్నాలు, పబ్లిక్ మీటింగ్స్ వల్లో రాలేదని, బిల్లు పాస్ చేయడం ద్వారా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

పార్లమెంటులో కొట్లాడింది మాత్రం కాంగ్రెస్ ఎంపీలేనని ఆయన చెప్పుకొచ్చారు. నా రాజకీయ జీవితంలో కాంగ్రెస్ ఎంతో చేసింది. తెలంగాణ పై తీర్మాణం చేసినప్పుడు కాకా వెంకటస్వామితో కలిసి పని చేశాను. చిన్న గొడవతోనే తాను కాంగ్రెస్ పార్టీని వీడానని తెలిపారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే.. ఆ సమయంలో నేను టీఆర్ఎస్ పార్టీలో చేరానని తెలిపారు. అలాగే ఇదే సందర్బంగా కేసీఆర్ ఫై ప్రశంసలు కురిపించారు. తెలంగాణను రీడిస్కవర్ చేయాలని KCR ఇచ్చిన పిలుపును ఎప్పటికీ తక్కువగా అంచనా వేయకూడదని కేకే అన్నారు. ఈరోజు తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉండటానికి కారణం కెసిఆర్ అని పేర్కొన్నారు. ఇంత చేసినప్పటికీ పార్టీ ఓడటం ఊహించనిదని అన్నారు. కుటుంబ పాలన అనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందని, పార్టీని నడిపించేందుకు తలసాని వంటి కొందరి పేర్లు తాను ప్రతిపాదించినా వినలేదని కేకే తెలిపారు. నా రాజకీయ జీవితంలో నాకు కాంగ్రెస్ పార్టీ ఎంతో ఇచ్చింది. రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు తెలిపారు.

Read Also : KTR : నమ్మించి మోసం చేసిన ద్రోహులు వారు – కేటీఆర్

Exit mobile version