సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ (Secunderabad Parade Grounds)లో జనవరి 13, 14, 15 తేదీల్లో 7వ అంతర్జాతీయ కైట్ మరియు స్వీట్ ఫెస్టివల్ (Kite and Sweet Festival) నిర్వహణకు హైదరాబాద్ నగరం సిద్దమవుతోంది. ఈ ఉత్సవానికి పర్యాటక, సాంస్కృతిక శాఖ భారీ ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఉత్సవంలో 16 దేశాల నుండి 47 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, 14 రాష్ట్రాల నుంచి 60 మంది దేశవాళీ కైట్ ప్లయర్స్ పాల్గొంటారు. వారు వినూత్నమైన డిజైన్లలో రూపొందించిన పతంగులను ప్రదర్శిస్తారు. తెలంగాణ పిండి వంటలు, ఇతర రాష్ట్రాల ప్రత్యేకమైన మిఠాయిలు మరియు అంతర్జాతీయ స్వీట్లను స్టాళ్లలో అందుబాటులో ఉంచుతారు. ఈ కార్యక్రమం తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది.
Post Office Scheme: పోస్టాఫీస్‌లో ఖాతా ఉందా.. అయితే ఈ సూపర్ స్కీమ్ మీ కోసమే!
కైట్ ఫెస్టివల్‌తో పాటు, సాంస్కృతిక ప్రదర్శనలు, హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల స్టాళ్లను ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటకులకు మరింత అనుభూతి కలిగేలా చేస్తున్నారు. ఈ సంవత్సరం 15 లక్షల మంది సందర్శకులు ఈ ఉత్సవానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, పోలీసులు మరియు ఇతర శాఖలు సందర్శకుల సౌకర్యాలను కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. తెలంగాణ టూరిజం శాఖ ద్వారా చారిత్రక ప్రదేశాలు, వారసత్వ కట్టడాలు, ప్రాచీన దేవాలయాల సందర్శనకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడతాయి. రాష్ట్ర పర్యాటక, భాషా సాంసృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పతంగుల ఫెస్టివల్ కు అంతర్జాతీయ, అంతర్రాష్టాల్లో పతంగులు ఎగురవేసే కైట్ ఫ్లయర్స్‌ను ఆహ్వానాలు పంపించారు. ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ర్టేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, స్కాట్లాండ్, థాయిలాండ్, కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, ఇటలీ, తైవాన్, సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్, తదితర దేశాలకు చెందిన 50మంది కైట్ ఫ్లయర్స్ హాజరవుతున్నారు.
ఈ ఉత్సవం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడంతో పాటు పర్యాటక ప్రాంతాల ప్రాచుర్యాన్ని పెంచుతుంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు కలిగించేలా ఈ ఉత్సవం నిర్వహించబడుతోంది. ఉత్సవంలో ఎంట్రీ ఉచితమని, ప్రతి ఒక్కరిని హాజరుకావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. పతంగుల, స్వీట్స్ ప్రదర్శనతో పాటు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ఆస్వాదించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తోంది.