Kishan Reddy Speech In Telangana Liberation Day : ఎంతోమంది బలిదానాలు, త్యాగాలతోనే తెలంగాణ నిజాం నియంతృత్వం నుంచి స్వాతంత్ర్యం పొందిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సికింద్రబాద్ పరేడ్ మైదానంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని (Telangana Liberation Day) ఘనంగా నిర్వహించారు. కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, కె.లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ (Kishan Reddy Speech)..వేలాది మంది తెలంగాణ ప్రజలు విరోచిత పోరాటం చేశారని, అనేక బలిదానాలు, అనేక త్యాగాల అనంతరం తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందని గుర్తు చేశారు. నిజాం రజాకార్ల మెడలు వంచి తెలంగాణ సాధించడంలో పటేల్ పాత్ర సాహసోపేతమైందన్నారు. గత మూడేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహిస్తుందని కేంద్ర మంతి కిషన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రజాకార్ల వారసత్వమైన మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తూ, అడుగులకు మడుగులొత్తుతూ తెలంగాణ ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించకుండా రెండు పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దుర్మార్గమైన రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
Read Also : Praja Palana Dinotsavam : నేనేమీ ఫామ్ హౌస్ సీఎంను కాదు – రేవంత్