Site icon HashtagU Telugu

Telangana: సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలపై సీబీఐ విచారణ..!

Telangana

Telangana

Telangana: కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. గత బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ భారీగా సొమ్ము కూడబెట్టుకుందని కాంగ్రెస్ మొదటి నుంచి ఆరోపిస్తూ వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో కాళేశ్వరంపై రాజకీయం మరింత ఊపందుకుంది. తాజాగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.

మాజీ సీఎం కేసీఆర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రక్షిస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. పొన్నం ఆరోపణలపై స్పదించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు కేంద్రానికి లేఖ రాయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి తన అధికారాన్ని ఎందుకు ఉపయోగించడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీజేపీకి వాటా ఉందని నిరూపించాలని కిషన్‌రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఆదాయాన్ని ఎలా సంపాదించాడో తెలంగాణలోని ప్రతి కొడుకుకు తెలుసని ఎద్దేవా చేశారు. అవసరమైతే రేవంత్ రెడ్డిని నన్ను కలిపి సీబీఐ విచారించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి.

త్వరలో జరగనున్న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ బీజేపీ చీఫ్ ప్రకటించారు. సంక్రాంతి నుంచి ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని, ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కోసం రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తామని కిషన్‌ తెలిపారు.

Also Read: Hair Tips: పాతకాలం నాటి చిట్కాలతో చుండ్రు సమస్యలకు చెక్ పెట్టండిలా?

Exit mobile version