Site icon HashtagU Telugu

Kishan Reddy : కిషన్ రెడ్డి చెప్పిన ముక్కోణపు ప్రేమ కథ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం

Kishan Reddy Sensational comments on Congress and BRS and MIM

Kishan Reddy Sensational comments on Congress and BRS and MIM

తెలంగాణ(Telangana) బీజేపీ(BJP) అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణాలో నడుస్తున్న ముక్కోణపు ప్రేమకథ గురించి చెప్పారు. అలాగే బీజేపీ పార్టీ గురించి, ఇటీవల బీజేపీ నుంచి సస్పెండ్ చేసిన జిట్టా బాలకృష్ణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు.

కిషన్ రెడ్డి(Kishan Reddy) మాట్లాడుతూ.. తెలంగాణలో అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు బీజేపీ గురించి. తెలంగాణ గ్రామీణ యువతలో బీజేపీకి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. కేసిఆర్ అవినీతి, అహంకార, కుటుంబ పాలన నుంచి తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి నాటకం ఆడుతున్నాయి. కాంగ్రెస్ లో గెలిచిన తర్వాత పలువురు ఎమ్మెల్యేలు BRS లో చేరారు. మోడీ సర్కారు మీద ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం మీద ఈ మూడు పార్టీలు సంతకాలు చేశాయి. ఇప్పుడు ఈ ముగ్గురూ బీజేపీని విమర్శిస్తున్నారు. ఇవి ఎన్నికలకి ముందు, లేదా తర్వాత కలిసి పనిచేసి, ప్రయాణం చేసే పార్టీలు. ముక్కోణపు ప్రేమ కథ ఈ మూడు పార్టీల మధ్య నడుస్తోంది. ఏ రోజు కూడా బీజేపీ, బీఆర్‌ఎస్ తో కలిసి పనిచేయలేదు, పనిచేయదు. ఆ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది అని అన్నారు.

ఇక నేడు ఇటీవల బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన జిట్టా బాలకృష్ణ రెడ్డి గన్ పార్క్ వద్ద ప్రెస్ మీట్ నిర్వహించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై కిషన్ రెడ్డి స్పందిస్తూ.. జిట్టా బాలకృష్ణ రెడ్డి ఇచ్చే సర్టిఫికేట్ నాకు అవసరం లేదు. అతను చేసే ఆరోపణలపై జవాబు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని అన్నారు.

 

Also Read : Jitta Balakrishna Reddy : జిట్టా బాలకృష్ణని సస్పెండ్ చేసిన బీజేపీ.. గన్ పార్క్ వద్ద కిషన్ రెడ్డిపై ఫైర్..

Exit mobile version