Site icon HashtagU Telugu

Kishan Reddy: తెలంగాణలో ప్రజా తీర్పును గౌరవిస్తాం, పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతాం!

Kishan Reddy Sensational comments on Congress and BRS and MIM

Kishan Reddy Sensational comments on Congress and BRS and MIM

Kishan Reddy: తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడో ప్లేసుకు ఖరారైన విషయం తెలిసిందే. అయితే గతంలో పోలిస్తే ఓటింగ్ శాతం పెరిగి ఒక ఎమ్మెల్యే స్థానం నుంచి 8 సీట్లను గెలుచుకుంది బీజేపీ పార్టీ. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రజాతీర్పును గౌరవిస్తామని, నిత్యం బీజేపీ విమర్శించిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆరే ఫామ్ హౌజ్ కు వెళ్లిపోయారని ఆయన అన్నారు.

తెలంగాణలో ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నామని, రానున్న రోజుల్లో మరింత ముందుకెళ్లి పార్లమెంట్ లో ఎన్నికల్లో సత్తా చాటుతామని ఆయన అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై ద్రుష్టి పెడుతామని, అన్ని స్థానాల్లో గెలుచుకునేందుకు కార్యాచరణ రూపొందిస్తామని అయన తెలిపారు. క్షేత్రస్థాయిలో బీజేపీ సమీక్ష నిర్వహించి, పార్లమెంట్ ఎన్నికలకు సిద్దమవుతామని కిషన్ రెడ్డి అన్నారు.

బీజేపీకి అనుకూలంగా ఓటు వేసిన ప్రజలకు ధన్యావాదలు తెలియజేశారు. తెలంగాణలో ఓటమి మాకు ఒక సవాలు అని, భవిష్యత్తులో మా తప్పులను సరిదిద్దుకొని ముందుకెళ్తామని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అన్నారు. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడి సేవలను పార్లమెంట్ ఎన్నికల్లో ఉపయోగించుకుంటామని, దేశంలో వచ్చే ఎన్నికలు చాలా కీలకమని ఆయన అన్నారు. కామారెడ్డిలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ ని ఓడించామని, బీజేపీ చరిత్రలో ఇది కొత్త అధ్యాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Also Read: KTR: ప్రతిపక్ష పార్టీ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిద్దాం: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేటీఆర్