Kishan Reddy:మేడారం జాతరకు జాతీయ పండుగ గుర్తింపు సాధ్యం కాదుః కిషన్ రెడ్డి

  • Written By:
  • Updated On - February 22, 2024 / 04:07 PM IST

Medaram Jatara: కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి(Kishan Reddy) మేడారం జాతరకు విచ్చేశారు. ఇక్కడ కొలువు దీరిన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా మేడారం జాతరను జాతీయ పండుగ(National festivalగా గుర్తించాలంటూ ఇటీవల వస్తున్న ప్రతిపాదనలపై కిషన్ రెడ్డి స్పందించారు. మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని చాలామంది అడుగుతున్నారని వెల్లడించారు. అయితే, జాతీయ పండుగ అనే విధానం ఎక్కడా లేదని, అందువల్ల మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. మేడారం జాతరకు అంతర్జాతీయ గుర్తింపు(International recognition)లభించేందుకు కృషి చేస్తానని కిషన్ రెడ్డి చెప్పారు.

ఇక, ములుగు(Muluguలో గిరిజన విశ్వవిద్యాలయం టెంపరరీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నామని, ఇది అమ్మవార్ల దయగానే భావిస్తామని తెలిపారు. ఈ ట్రైబల్ వర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉంటుందని కిషన్ రెడ్డి వివరించారు. వర్సిటీ భవనాలకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారని, ఈ ఏడాదే ప్రవేశాలు ఉంటాయని వెల్లడించారు. వర్సిటీలో అధిక భాగం సీట్లు తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తారని స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, మేడారం జాతర(Medaram Jatara) రెండో రోజు అత్యంత కోలాహలంగా సాగుతోంది. భక్తకోటి జయజయధ్వానాల మధ్య మేడారం మహాజాతర బుధవారం ప్రారంభమైంది. మొదటి రోజు కీలక ఘట్టమైన సారలమ్మ ఆగమనం నేపథ్యంలో వనం మొత్తం జనంతో నిండిపోయింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలతో తోడ్కొని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజు, గోవిందరాజులనూ గద్దెలపై కొలువుదీర్చారు. మహాజాతర రెండో రోజైన నేడు ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క చిలకలగుట్ట నుంచి గద్దెలపైకి రానుంది. మేడారం మహా జాతరలో అత్యంత కీలకఘట్టం సమ్మక్క ఆగమనమే. యావత్ భక్తకోటి ఆమె రాక కోసం ఎదురుచూస్తారు. గుట్ట దిగగానే జనం ఆమెకు జేజేలు పలుకుతారు. కాకతీయ సేనలపై అసామాన్య పోరాటపటిమను ప్రదర్శించి అడవి బిడ్డల గుండెల్లో వీరనారీమణిగా నిలిచి దేవతే సమ్మక్క. ఆమె రాక కోసం తనువెల్లా కళ్లు చేసుకుని భక్తులు ఎదురు చూస్తారంటే అతిశయోక్తి కాదు. గద్దెలపైన కొలువైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు.

read also : Narendra Modi: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన దేశాధినేతల్లో మోడీకి అగ్రస్థానం