Phone Tapping : సినీ స్టార్లను కూడా వదిలిపెట్టకుండా ఫోన్ ట్యాపింగ్ చేసారు – కిషన్ రెడ్డి

బిఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందని , రాజకీయ నేతల ఫోన్లు కాదు సినీ స్టార్ల ఫోన్లు సైతం ట్యాప్ చేసి డబ్బులు దండుకున్నారని

  • Written By:
  • Publish Date - April 13, 2024 / 05:16 PM IST

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం రోజు రోజుకు కాకరేపుతున్న సంగతి తెలిసిందే. త్వరలో లోక్ సభ (Lok Sabha) ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ (Congress), బిజెపి (BJP) పార్టీలు బిఆర్ఎస్ ను పదే పదే ఫోన్ ట్యాపింగ్ తో జతకట్టి విమర్శలు చేస్తుంది. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందని , రాజకీయ నేతల ఫోన్లు కాదు సినీ స్టార్ల ఫోన్లు సైతం ట్యాప్ చేసి డబ్బులు దండుకున్నారని .. ఈ వ్యవహారం మొత్తం కేటీఆర్ కనుసన్నల్లో జరిగిందని ఆరోపిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సైతం మరోసారి ఈ వ్యవహారం ఫై మాట్లాడుతూ..మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని.. ఈ కేసుపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షణలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో రాజకీయ నేతలే కాదు.. సినీ నటులు, వ్యాపారులు కూడా ఉన్నారని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పలువురిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూల్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను దెబ్బ తీయడానికి ఫోన్ ట్యాపింగ్ చేశారని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తే ఈ కేసులో అసలు న్యాయం జరగదని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటె కిషన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను కేటీఆర్ ఖండించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఇందుకు అవసరమైతే నార్కో, లై డిటెక్టర్‌ పరీక్షలకు తాను సిద్ధంగా ఉన్నానని, తనపై నిత్యం ఆరోపణలు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తనతోపాటు లై డిటెక్టర్‌, నార్కో అనాలసిస్‌ పరీక్షకు రావాలని సవాల్‌ చేశారు.

Read Also : Post Office Scheme: మీ ఖాతాలోకి ప్ర‌తి నెలా రూ.9,250.. మీరు చేయాల్సింది ఇదే..!