Telangana Polls : మళ్లీ బీఆర్ఎస్ గెలిస్తే ప్రజల చేతికి చిప్పే – కిషన్ రెడ్డి

ఎన్నికల పోలింగ్ (TS Polls) సమయం ఇంకో 9 రోజులు మాత్రమే ఉండడం తో అధికార పార్టీ బిఆర్ఎస్ (RS) ఫై బిజెపి (BJP) మరింత విమర్శలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడింది. బండి సంజయ్ , ఈటెల రాజేందర్ , రాజాసింగ్, కిషన్ రెడ్డి , ధర్మపురి ఇలా అగ్ర నేతలంతా విస్తృత ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. We’re now on WhatsApp. Click to Join. సోమవారం […]

Published By: HashtagU Telugu Desk
Kishan Reddy Kcr

Kishan Reddy Kcr

ఎన్నికల పోలింగ్ (TS Polls) సమయం ఇంకో 9 రోజులు మాత్రమే ఉండడం తో అధికార పార్టీ బిఆర్ఎస్ (RS) ఫై బిజెపి (BJP) మరింత విమర్శలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడింది. బండి సంజయ్ , ఈటెల రాజేందర్ , రాజాసింగ్, కిషన్ రెడ్డి , ధర్మపురి ఇలా అగ్ర నేతలంతా విస్తృత ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర బిజెపి అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ గెలిస్తే ప్రజల చేతికి చిప్ప, కాంగ్రెస్ గెలిస్తే భస్మాసుర హస్తమే మిగులుతుందని ధ్వజమెత్తారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా బీజేపీ మేనిఫెస్టో రూపొందించామన్నారు. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజలు స్పందిస్తున్నారని.. వారి ప్రచార వాహనాలను ప్రజలే స్వచ్ఛందంగా అడ్డుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఆ పార్టీవి ఫేక్ గ్యారెంటీలు అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ కారుల ఆకాంక్షలు నెరవేరాలంటే బీజేపీ గెలవాలన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడి ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని.. కర్నాటకలో ఇచ్చిన ఐదు గ్యారెంటీలకే దిక్కులేదని మరి తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ చెప్పిన అనేక పథకాలకు హామీలు ఇచ్చి వాటిని మొదలు పెట్టక ముందే కొత్త పథకాలకు హామీ ఇస్తున్నారని ధ్వజమెత్తారు.

Read Also : Bethavolu Canal : ఊడిన బేతవోలు కాలువ షట్టర్‌..చేతికందిన పంట నీట మునిగే

  Last Updated: 20 Nov 2023, 01:41 PM IST