Kaleshwaram Project: కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలి: కిషన్ రెడ్డి

ప్రతిష్ఠాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్షం, అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Kaleshwaram Project: ప్రతిష్ఠాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్షం, అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పైగా ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల కోట్ల ప్రజాధనం వృథా అయిందన్నారు కిషన్ రెడ్డి. ప్రపంచంలోనే అత్యున్నత మేధావి అని 80 వేల పుస్తకాలు చదివానని, దేశ రాజ్యాంగాన్ని తిరగరాస్తానని చెప్పిన కేసీఆర్ తెలంగాణ మేధావుల మాట వినకుండా ప్రాజెక్టు కట్టి లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు.

ఈరోజు కిషన్ రెడ్డి మేడిగడ్డ , అన్నారం బ్యారేజీలను బీజేపీ నేత లక్ష్మణ్‌, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి పరిశీలించారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో మేడిగడ్డ చేరుకున్న వారికి స్థానిక బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అక్కడి సిబ్బందితో మాట్లాడి మేడిగడ్డ బ్యారేజీ గురించి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీ నష్టానికి సీఎం కేసీఆర్‌ పూర్తి బాధ్యత వహించి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మేడిగడ్డ పిల్లర్లకు పగుళ్లు వచ్చిన విషయం తెలియగానే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాశామని, ఈ లేఖపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం స్పందించిందని తెలిపారు . అన్నారం బ్యారేజీ పరిస్థితి కూడా మేడిగడ్డలా ఉందని, ఇక్కడ ఒక్క టీఎంసీ నీరు కూడా నిల్వ ఉండదని కిషన్ రెడ్డి విమర్శించారు.

ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు . కాంగ్రెస్ ప్రభుత్వం అంచనాలను పూర్తిగా మార్చివేసి ప్రణాళిక లేకుండానే ప్రాజెక్టును నిర్మించారని ఆరోపించారు. కేసీఆర్‌ పోకడలతో ప్రాజెక్టు కట్టారని, ఇంజనీర్ల మాట వినకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారన్నారు. కేసీఆర్ వల్లే ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు ఉచ్చుగా మారింది. ప్రజాధనాన్ని వృధా చేసి నాసిరకం ప్రాజెక్టును నిర్మించారని మండిపడ్డారు. ఇప్పటి వరకు బ్యారేజీ నష్టంపై సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

Also Read: Vaibhav: తెలుగు, తమిళ భాషల్లో వైభవ్, పార్వతి నాయర్ జంటగా నటించిన ‘ఆలంబన’ విడుదల