రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో (Lok Sabha Elections) జనసేన పార్టీ (Janasena) తో ఎలాంటి పొత్తు ఉండదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు కేంద్రమంత్రి , రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి (Kishan Reddy). తెలంగాణలో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండదు.. 17 పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం అని తేల్చి చెప్పారు. జనసేన ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉందని, ఏపీలో జనసేనతో పొత్తు అంశం ఇంకా చర్చకు రాలేదని క్లారిటీ ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ చేసిన అతిపెద్ద స్కామ్ అని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు, పథకాల అమలులో జరిగిన అవినీతిపై విచారణ జరుపుతామని అన్నారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ స్టేట్‌కు సంబంధించిన వ్యవహారాలపై దర్యాప్తు చేయకుండా బీఆర్ఎస్ చట్టాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఆ చట్టాన్ని తీసివేసి కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు చేస్తుందా..? లేక బీఆర్ఎస్‌ను కాపాడుతుందా అని ప్రశ్నించారు.
Read Also : TSRTC : రేవంత్ సర్కార్ కు షాక్ ఇచ్చిన టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు