Khammam TDP : ఎమ్మెల్యేలు, ఎంపీలు లేని ఖ‌మ్మం స‌భ‌.. చంద్ర‌బాబుకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిన తెలంగాణ ప్ర‌జ‌లు

తెలంగాణ‌లో టీడీపీకి పూర్వ‌వైభవం తీసుకు వ‌చ్చేందుకు ఖ‌మ్మం స‌భ‌తో అధినేత చంద్ర‌బాబు ప్రారంభించారు. టీటీడీపీకి

  • Written By:
  • Updated On - December 22, 2022 / 07:23 AM IST

తెలంగాణ‌లో టీడీపీకి పూర్వ‌వైభవం తీసుకు వ‌చ్చేందుకు ఖ‌మ్మం స‌భ‌తో అధినేత చంద్ర‌బాబు ప్రారంభించారు. టీటీడీపీకి నూత‌న అధ్య‌క్షుడిగా కాసాని జ్ఞానేశ్వ‌ర్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత జ‌రుగుతున్న తొలి భారీ బ‌హిరంగ స‌భకు భారీగా క్యాడ‌ర్ త‌ర‌లివ‌చ్చారు. అన‌కున్న షెడ్యూల్ కంటే ఆల‌స్యంగానే చంద్ర‌బాబు రోడ్ షో సాగింది. హైద‌రాబాద్ నుంచి ఖ‌మ్మం వ‌ర‌కు అడుగ‌డుగునా ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. అయితే తెలంగాణ‌లో గెలిచిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు అది కూడా ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లి నుంచి గెలిచిన సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌, అశ్వార‌రావుపేట నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వ‌ర‌రావులు పార్టీ మారారు. దీంతో టీటీడీపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. అయిన‌ప్ప‌టికీ ఖ‌మ్మం స‌భ‌కు క్యాడ‌ర్ స్వ‌చ్ఛందంగా త‌ర‌లిరావ‌డంతో తెలుగు త‌మ్ముళ్లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. తెలంగాణలో టీడీపీ ప‌ని అయిపోంద‌ని అంటున్న వారికి ఈ స‌భ చూస్తే అర్థం అవుతుంద‌ని టీటీడీపీ కార్య‌క‌ర్త‌లు అంటున్నారు