Site icon HashtagU Telugu

US : పాపం సాయితేజ.. ఫ్రెండ్ కోసం డ్యూటీ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నాడు

Saiteja Murder

Saiteja Murder

ఉన్నంత చదువుల కోసం అమెరికా (US) వెళ్లిన తెలుగు వారు అక్కడివారు కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది ప్రాణాలు విడువగా..తాజాగా ఖమ్మంకు చెందిన సాయితేజ (Saiteja) (26) అనే విద్యార్థిని దుండుగులు కాల్పుల్లో మృతి చెందాడు. నాలుగునెలల క్రితం చికాగో (Chicago ) కాంకోడియా యూనివర్శిటీలో ఎంఎస్ చదివేందుకు అమెరికా కు వెళ్ళాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తానంటే కష్టమైనా సరేనని పంపించారు. అక్కడ చదువుకుంటూనే పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తున్నానంటే మురిసిపోయారు. కానీ, ఆ తల్లిదండ్రుల సంతోషం ఎక్కువ కాలం నిలువలేకదు.

ఎంఎస్‌ కోసం అమెరికా వెళ్లిన కొడుకు.. దుండగుల కాల్పుల్లో దుర్మరణం చెందాడన్న దుర్వార్త ఆ తల్లిదండ్రులను శోకసంద్రంలోకి ముంచింది. అంతకుముందు రోజు రాత్రే వీడియో కాల్‌ మాట్లాడిన కొడుకు.. తెల్లారే సరికే కానరాని లోకాలకు చేరాడనే ఫోన్‌కాల్‌ విన్న ఆ తల్లిదండ్రులు.. దిగ్భ్రాంతికి గురయ్యారు. శుక్రవారం పార్ట్‌ టైమ్‌జాబ్‌ చేస్తున్న క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు షాపింగ్‌మాల్‌లోకి చొరబడి డబ్బులివ్వాలని సాయితేజను డిమాండ్‌ చేశారు. దీంతో భయపడిన సాయితేజ.. కౌంటర్‌ నుంచి డబ్బులు తీసి వారికి ఇచ్చాడు. అయినప్పటికీ ఆ దుండగులు సాయితేజపై కాల్పులు జరిపి వెళ్లిపోయారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.

సాయి తేజ తన డ్యూటీ ముగిసినప్పటికీ..తన స్థానంలో ఉండాల్సిన మరో స్నేహితుడు నమాజ్ కు వెళ్తానని చెప్పడంతో సాయితేజ అక్కడే ఉండిపోయాడు. ఈ సమయంలోనే దుండగులు డబ్బులు ఇవ్వాలని తుపాకులతో బెదిరించారు. డబ్బులిచ్చినా చంపేసి వెళ్లిపోయారు. స్నేహితుడి కోసం తేజ ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. సాయితేజ మరణ వార్త విషయం తెలుసుకున్న ఎంపీ రఘురాంరెడ్డి ఫోన్లో సాయితేజ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాన్ని స్వదేశానికి త్వరగా పంపించాలని వీదేశీ మంత్రిత్వ శాఖతో మాట్లాడినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువస్తామని తెలిపారు.

Read : Porn Racket Case : సినిమా ఛాన్స్ పేరుతో దగా.. యువతులతో పోర్న్‌ మూవీస్.. రాజ్‌కుంద్రాకు ఈడీ సమన్లు