Khammam Politics: ఖమ్మం రాజకీయ కాక, పొంగులేటి & తుమ్మల

ఆర్ ఎస్ పార్టీలోనే బల నిరూపణకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి , మాజీ మంత్రి తుమ్మల మధ్య రాజకీయ విందు పోటీ జరిగింది. కొత్త ఏడాది తొలి రోజు అందుకు ఖమ్మం వేదిక అయింది.

  • Written By:
  • Updated On - January 1, 2023 / 08:08 PM IST

టిఆర్ఎస్ పార్టీలోనే బల నిరూపణకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి , మాజీ మంత్రి తుమ్మల మధ్య రాజకీయ విందు పోటీ జరిగింది. కొత్త ఏడాది తొలి రోజు అందుకు ఖమ్మం వేదిక అయింది.
గత ఎన్నికల సందర్భంగా భారత రాష్ట్ర సమితి ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాదని నామా నాగేశ్వరరావుకు టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో నామా ఘనవిజయం సాధించారు. అప్పటి నుంచి పొంగులేటికి సరైన ప్రాతినిధ్యం దక్కడంలేదంటూ ఆయన అనుచరులు కినుక వహించారు. ఇటీవల పొంగులేటి పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరిగినప్పటికీ ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా రానున్న ఎన్నికల్లోపోటీచేయబోతున్నానంటూ ప్రకటించడంతో రాజకీయం వేడెక్కింది.
గతంలో తుమ్మల ప్రాతినిధ్యం వహించిన పాలేరు నియోజకవర్గ పరిధిలోకి ఈ గృహప్రవేశ (విందు) కార్యక్రమం వస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి నాయకులు భారీగా తరలివచ్చారు. భవిష్యత్తులో తామంతా తుమ్మల వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా అభివృద్ధికి తుమ్మల నాగేశ్వరరావు చేసిన కృషిపై 10వేల పుస్తకాలు పంపిణీ చేయటం హైలైట్. పాలేరు నుంచి మళ్లీ పోటీచేయాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే భారత రాష్ట్ర సమితి తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కందాల ఉపేందర్ రెడ్డిఉన్నారు. రానున్న ఎన్నికల్లో తాను పోటీచేయడం ఖాయమని ఆయన ప్రకటిస్తున్నారు.

మరో వైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అభిమానులు, కార్యకర్తల కోసం ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తరలివచ్చిన నాయకులు ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మీ అందరి మనసులో ఏముందో తనకు తెలుసని, అందరూ కాస్తంత ఓపిక పట్టాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేస్తానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తనతోపాటు తన అనుచరులు కూడా అన్ని నియోజకవర్గాల్లో పోటీచేస్తారని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ భవితవ్యంపై జోరుగా చర్చ నడుస్తోంది. కొత్త సంవత్సరంలో సత్తా చాటేందుకు వీరిద్దరూ విందు రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఖమ్మం రూరల్ లో గృహప్రవేశం సందర్భంగా తుమ్మల విందు ఏర్పాటు చేశారు. తుమ్మల అభిమానులు, నాయకుల ఆత్మీయ కలయిక పేరుతో ఇది జరిగింది. మొత్తం మీద ఖమ్మం రాజకీయం కేసీఆర్ కు తలనొప్పిగా మారగా, ఇద్దరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనేది ఆసక్తికరం.