అల్ప పీడన ప్రభావం తో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు , వంకలు ఉప్పంగిప్రవహిస్తున్నాయి. దీంతో అనేక చెరువులకు గండి పడి వరద ప్రవాహం ఇళ్లలోకి చేరాయి. అంతే కాదు అనేక చోట రహదారులు , రైల్వే ట్రాక్ లు తెగిపోయి రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది.
ఇక ఖమ్మం జిల్లా విషయానికి వస్తే..
జిల్లాలో రెండ్రోజులుగా భారీ వర్షంకురుస్తోంది. శుక్రవారం మొదలైన వర్షం ఆదివారం వరకు అలాగే కొనసాగుతుండడం తో జనజీవనం స్తంభించింది. వరద భారీగా చేరడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలాచోట్ల చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. తిరుమలాయపాలెం మండలంలోని రాకాసి తండాను ఆకేరు వరద ప్రవాహం చుట్టుముట్టింది. వరద ప్రవాహం పెరుగుతుండడంతో గ్రామస్తులు డాబాల పైకి ఎక్కి తమను కాపాడాలంటూ వేడుకుంటున్నారు. ఖమ్మం నగరంతోపాటు శివారు ప్రాంతాలైన చింతకాని, రఘునాపథపాలెం, ఖమ్మం రూరల్ తదితర మండలాల్లోనూ భారీ వర్షం కురుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ ప్రమాదకరపు అంచుల్లో అలుగు పోస్తుంది. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షానికి..చుట్టుపక్కల నుంచి భారీగా వరదనీరు పాలేరుకు చేరుతోంది. దీంతో 23 అడుగుల గరిష్ట నీటి మట్టానికి గాను 26.అడుగులకు చేరుకుంది. దీంతో జలాశయం నిండుకుండగా మారింది. జిల్లా సరిహద్దు ఎగువ ప్రాంతాల నుండి వరద ప్రవాహంతో పాలేరు ఏటినుంచి వరదనీరు చేరుతుంది. దీంతో రిజర్వాయర్ కట్ట కోతకు గురవుతుంది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. పాలేరు రిజర్వాయర్ పొంగి పక్కనే అన్న నాయకన్ గూడెం గ్రామంలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ..మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలోకి నీరు చేరడం తో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నామని..ఎవరైనా సాయం చేస్తారో అని ఎదురుచూస్తున్నామని..గ్రామం మునిగిపోతున్నమంత్రి పట్టించుకోవడం లేదని , ఇంత వర్షం పడుతున్న మంత్రి శ్రీను కు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. 40 ఏళ్ల చరిత్ర ఉన్న పాలేరు పొంగడం ఇదే మొదటి సారి..ఇది అధికారుల తప్పిదం వల్లనే ఇలా జరిగిందంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాలేరు గ్రామంలోని వడ్డెర కాలనీ సుమారు 6 నుండి ఏడు అడుగులకు వరద నీరు చేరుకోవడంతో ఇండ్లు నీటమటమయ్యాయి. నీటిలో చిక్కుకున్న 23కుటుంబాలను గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలకు,ప్రైవేట్ ఫంక్షన్ హాలుకు,సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్నివేల ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. పాలేరు ఉప్పొంగి ప్రవహిస్తుండడం తో ఖమ్మం-సూర్యాపేట జాతీయ(పాత )రహదారిపై నుంచి వరదనీరు ప్రవహిస్తోంది. సుమారు రహదారి పై 3 అడుగు లోతు నీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Read Also : Gabbar Singh Rerelease : హరీష్ శంకర్ మల్లెపూలు.. బండ్ల గణేష్ ఏం చెప్పారంటే..!