Tummala : తెలంగాణ‌లో టీడీపీ అభిమానులు వివేకంతో ఓటేయాలి – ఖమ్మం కాంగ్రెస్ అభ్య‌ర్థి తుమ్మ‌ల‌

తెలంగాణ ఎన్నిక‌ల్లో టీటీడీపీ ఓట్లు కీల‌కంగా మార‌నున్నాయి. తెలుగుదేశం పార్టీకి కొన్ని జిల్లాలో బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉన్న‌ప్ప‌టికి

  • Written By:
  • Updated On - November 2, 2023 / 03:31 PM IST

తెలంగాణ ఎన్నిక‌ల్లో టీటీడీపీ ఓట్లు కీల‌కంగా మార‌నున్నాయి. తెలుగుదేశం పార్టీకి కొన్ని జిల్లాలో బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉన్న‌ప్ప‌టికి ఏపీలో చంద్ర‌బాబు అరెస్ట్ తదిత‌ర ప‌రిణామాల‌తో ఇక్క‌డ పోటీ నుంచి ఆ పార్టీ త‌ప్పుకుంది. అయితే టీటీడీపీ ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోయిన‌.. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లంతా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్ప‌టికే కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను టీడీపీ నాయ‌కులు క‌లిసి సంఘీభావం తెలుపుతున్నారు. ముఖ్యంగా టీడీపీకి కంచుకోట‌గా ఉన్న ఖ‌మ్మం జిల్లాలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. టీడీపీ ఓట్ల కోసం బీఆర్ఎస్ పాకులాడుతుంది. అయితే ఖ‌మ్మంలో టీడీపీ శ్రేణులంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. ముఖ్యంగా ఖ‌మ్మం అసెంబ్లీ నుంచి మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు పోటీ చేస్తుండ‌టంతో క్యాడ‌ర్ అంతా ఆయ‌న వైపే మొగ్గు చూపుతుంది. గ‌తంలో ఆయ‌న టీడీపీలో ప‌ని చేసి ఉండ‌టం.. 40 ఏళ్ల రాజ‌కీయంలో ఆయ‌న ద్వారా ప‌ద‌వులు పొందిన వారంతా ఆయ‌న వెంటే న‌డుస్తున్నారు. దీనికి తోడు ఖ‌మ్మంలో క‌మ్మ‌ సామాజిక‌వ‌ర్గం ఎక్కువ‌గా ఉండ‌టం తుమ్మ‌ల‌కు క‌లిసి వ‌చ్చే అంశం.

We’re now on WhatsApp. Click to Join.

చంద్ర‌బాబు అరెస్ట్‌పై మొట్ట‌మొద‌టిగా తెలంగాణ నుంచి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు స్పందించారు. చంద్ర‌బాబు రిలీజ్ అయిన త‌రువాత ఖ‌మ్మం టీడీపీ ఆఫీసులో జ‌రిగిన సంబంరాల్లో నేరుగా వెళ్లి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు పాల్గొన‌డం విశేషం.చంద్రబాబు అక్రమ అరెస్టుతో టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నాయని తుమ్మ‌ల వ్యాఖ్యానించారు. చంద్రబాబును జైలు పాలు చేసిన శక్తులు ఎవరో మీకు తెలుసు.. ఈ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు వివేకంతో ఓటేయాలంటూ టీడీపీ క్యాడ‌ర్‌కు కాంగ్రెస్ అభ్య‌ర్థి తుమ్మ‌ల పిలుపునిచ్చారు. త‌న‌కు ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఇస్తే.. చంద్రబాబు ప్రోత్సహించారని,,- 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఖమ్మం అభివృద్ధికి ఎంతో కృషి చేశాన‌న్నారు . బీఆర్‍ఎస్ పాలనలో ఖమ్మంలో అరాచకం, భూకబ్జాలు పెరిగాయని తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఆరోపించారు.

Also Read:  Chandrababu : చంద్రబాబు ఫై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు