Site icon HashtagU Telugu

khairatabad Ganesh Immersion : ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఫుల్ డీటెయిల్స్

khairatabad ganesh shobha yatra 2023

khairatabad ganesh shobha yatra 2023

నవరాత్రులు పూజలు అందుకున్న మహాగణపతి (khairatabad Ganesh) రేపు గంగమ్మ ఒడిలోకి (Immersion ) చేరబోతున్నాడు. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు యావత్ గణేష్ భక్తులు సిద్దమవుతున్నారు. దేశ వ్యాప్తంగా ఖైరతాబాద్ మహాగణపతి కి ప్రాముఖ్యత ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని దశాబ్దాలుగా ఖైరతాబాద్ మహాగణపతి కి ఎంతో విశేష భక్తి ఆదరణ కొనసాగుతుంది. ఇక రేపు మహాగణపతి గంగమ్మ ఒడిలోకి చేరబోతున్నాడు. ఈ క్ర‌మంలో ఖైర‌తాబాద్ గ‌ణేశుడికి బుధ‌వారం అర్ధ‌రాత్రి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు. గురువారం ఉద‌యం 6 గంట‌ల‌కు గ‌ణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి 2 గంట‌ల మ‌ధ్య నిమ‌జ్జ‌నం చేయ‌నున్న‌ట్లు భాగ్య‌న‌గ‌ర్ గ‌ణేశ్ ఉత్స‌వ స‌మితి వెల్ల‌డించింది.

అలాగే మహాగణపతి శోభాయాత్ర చూస్తే (Khairatabad Ganesh Shobha Yatra 2023)..

టెలిఫోన్ భవన్, సచివాలయం మీదుగా ఈ యాత్ర ఎన్టీఆర్ మార్గ్ చేరుకుంటుంది. ఉదయం 10 గంటలకు ట్యాంక్‌బండ్‌పై ఉన్న క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకుంటారు మహా గణపతి. అనంతరం భారీ వాహనంపై నుంచి మహాగణపతి విగ్రహం తొలగింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. క్రేన్ నెంబర్ 4 వద్ద ఉదయం 10.30 గంటలకు పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంట‌ల నుంచి 2 గంట‌ల మ‌ధ్య నిమ‌జ్జ‌నం చేయనున్నారు.

అలాగే గ‌ణేశ్ నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మం కోసం హైద‌రాబాద్‌లో 40 వేల మంది పోలీసుల‌తో బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగ‌ర్ చుట్టూ 5 చోట్ల 36 క్రేన్లు, ప‌దుల కొద్ది జేసీబీలు, టిప్ప‌ర్లు, వేలాది మంది సిబ్బందితో నిమ‌జ్జ‌న ప్ర‌దేశాలు సిద్ధ‌మ‌య్యాయి. దాదాపు 48 గంట‌ల పాటు సాగే ఊరేగింపును 20 వేల‌కు పైగా సీసీ కెమెరాల‌తో క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నుంచి ప‌ర్య‌వేక్షించ‌నున్నారు.

Read Also : Police Notice : బీజేపీ ఎంపీ అర్వింద్‌కు నోటీసులు