Khairatabad Ganesh: ఖైరతాబాద్‌ గణేషుడి పనులు షురూ.. ఈ ఏడాది 61 అడుగులతో దర్శనం!

ఖైరతాబాద్‌ మహాగణపతి ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 61 అడుగులతో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు

  • Written By:
  • Updated On - June 1, 2023 / 01:03 PM IST

గత ఏడాది 60 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన ఖైరతాబాద్‌ మహాగణపతి ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 61 అడుగులతో భక్తులకు దర్శనమిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులునిర్వహించిన కర్రపూజా కార్యక్రమంలో తెలిపారు. ప్రతి యేటా ఖైరతాబాద్‌ మహాగణపతి తయారీ పనులకు మూడు నెలల ముందే నిర్జల ఏకాదశి రోజు కర్రపూజ నిర్వహించి పనులను ప్రారంభిస్తారు. అదే ఆనవాయితీగా బుధవారం సాయంత్రం ఖైరతాబాద్‌ మహాగణపతి సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కర్రపూజతో విగ్రహ తయారీ పనులకు శ్రీకారం చుట్టారు.

రాష్ట్ర ప్రభుత్వం అన్ని పండుగలకు తగిన ప్రాధాన్యతనిస్తున్నదని, ఖైరతాబాద్‌ గణేశ్‌ నవరాత్రోత్సవాలకు సైతం ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు, అడిషనల్‌ డీసీపీ రమణా రెడ్డి, ఏసీపీ సంజీవ్‌ కుమార్‌, సైఫాబాద్‌, ఖైరతాబాద్‌, నాంపల్లి సీఐలు సత్తయ్య, నిరంజన్‌ రెడ్డి, రాజునాయక్‌, భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ కార్యదర్శి డాక్టర్‌ భగవంత్‌ రావు, ఉపాధ్యక్షులు కరోడిమల్‌, గణేశ్‌ ఉత్సవ కమిటీ ప్రతినిధులు మహేశ్‌ యాదవ్‌, మహేందర్‌ బాబు, రాంరెడ్డి, కృష్ణాయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Free Notebooks: విద్యార్థులకు గుడ్ న్యూస్, ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ!