TPCC Meetings: నేడు గాంధీ భవన్‌లో టీపీసీసీ కీలక సమావేశాలు!

ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పార్టీ ఐక్యత, కార్యకర్తల సమన్వయంపై దిశానిర్దేశం చేయ‌నున్నారు. ఈ సమావేశాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్రంలో రాజకీయ ఉనికిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.

Published By: HashtagU Telugu Desk
TPCC Meetings

TPCC Meetings

TPCC Meetings: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC Meetings) నేడు హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో పలు కీలక సమావేశాలను నిర్వహించనుంది. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశాలు పార్టీ సంస్థాగత బలోపేతం, రాబోయే రాజకీయ సవాళ్ల కోసం వ్యూహ రచనపై దృష్టి సారించాయి. ఉదయం 10 గంటలకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జ‌ర‌గ‌నుంది. పార్టీలో క్రమశిక్షణ, నాయకుల బాధ్యతలపై చర్చించారు. ఉదయం 11 గంటలకు పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC), పీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఎన్నికల వ్యూహాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మధ్యాహ్నం తర్వాత టీపీసీసీ నూతన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశం జ‌ర‌గ‌నుంది. ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన నేతలకు నియామక పత్రాలను అంద‌జేస్తారు. ఈ కార్యక్రమం పార్టీలో కొత్త నాయకత్వాన్ని ఏకీకృతం చేయడంలో ముఖ్యమైన అడుగుగా గుర్తించబడింది. ఈ సమావేశాల్లో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శి విశ్వనాథన్, రాష్ట్ర మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. వీరు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, గ్రామీణ స్థాయిలో కార్యకర్తల సమన్వయం, ప్రజల సమస్యలపై పోరాటంపై విస్తృతంగా చర్చించనున్నారు.

Also Read: Ind Vs Eng: ఇంగ్లాండ్‌పై భార‌త్ గెల‌వాలంటే 10 వికెట్లు తీయాల్సిందే!

ఇటీవ‌ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలుస్తుంది. సంస్థాగతంగా మరింత బలోపేతం కావడం, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం మన లక్ష్యం” అని అన్నారు. ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పార్టీ ఐక్యత, కార్యకర్తల సమన్వయంపై దిశానిర్దేశం చేయ‌నున్నారు. ఈ సమావేశాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్రంలో రాజకీయ ఉనికిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. కాంగ్రెస్ నాయకత్వం ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, పార్టీని గ్రామీణ స్థాయిలో బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటోంది.

  Last Updated: 24 Jun 2025, 09:36 AM IST