TS: BRSలో కవితకు కీలక బాధ్యతలు..!!

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన సంగతి తెలిసిందే. అయితే రానున్నరోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో కీలక మార్పులు జరగబోతున్నాయి.

  • Written By:
  • Updated On - October 13, 2022 / 10:59 AM IST

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన సంగతి తెలిసిందే. అయితే రానున్నరోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో కీలక మార్పులు జరగబోతున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్ తో సహా ఆయక కుమారుడు, కుమార్తె కీలక బాధ్యతల్లో ఉన్నారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటే..కవిత ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయితే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ లో కవితకు కీలక బాధ్యతలు అప్పగిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రకటనకు నేతలంతా హాజరైనప్పటికీ కవిత మాత్రం డుమ్మా కొట్టారు. దీంతో కవిత గైర్హజరుపై పెద్దెత్తున చర్చ జరిగింది. కేసీఆర్ కుటుంబంలో చీలికలంటూ ప్రధాన ప్రతిపక్షాలు వ్యాఖ్యానించాయి. అయితే అనుహ్యంగా తన కూతురు కవితతో కలిసి సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం… ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గ్గా మారింది.

ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొన్న కేసీఆర్, కవిత నేరుగా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని పరిశీలించారు. వీలైనంత తొందరగా భవనాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. పలువురు జాతీయ పార్టీల నేలతోపాటు పలువురు ప్రముఖులతో భేటీ కానున్నారు.

Also Read:   TS : వీఆర్ఏలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..!!

ఇక కవిత ఢిల్లీకి ఎందుకు వెళ్లారన్న ప్రశ్నలకు రాజకీయాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావు అరెస్టు కావడం..తన కూతురుని కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ రెండు రోజులపాటు ఢిల్లీలో మకాం వేశారని…విపక్షాలు అంటున్నాయి. అయితే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో తన కూతుకు కవితకు జాతీయస్థాయిలో కీలక బాధ్యతలు అప్పజెపుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కవిత గతంలో ఎంపీగా పనిచేశారు. ఢిల్లీలో మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కవితకు కీలక బాధ్యతలు అప్పజెప్పాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు సమాచారం.మొత్తానికి రాష్ట్రంలో కుమారుడికి…జాతీయ స్థాయిలో కూతురుకు కీలక బాధ్యతలు అప్పజెప్పనున్నారు కేసీఆర్.