Site icon HashtagU Telugu

T Congress : రేపు భారీ ఎత్తున కాంగ్రెస్ లో చేరబోతున్న బిఆర్ఎస్ కీలక నేతలు

Congress Rajya Sabha Candidates

Congress Emls

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ (Congress) లోకి వలసల పర్వం అనేది తగ్గడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలాగైతే బిఆర్ఎస్(BRS) నుండి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ లో చేరి..విజయం సాధించారో..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అలాగే నేతలు చేరుతున్నారు. ఇప్పటీకే ఎంతోమంది కాంగ్రెస్ గూటికి చేరగా..రేపు (ఫిబ్రవరి 16) పెద్ద ఎత్తున నేతలు చేరబోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ ZP ఛైర్పర్సన్ సునీత CM రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అలాగే మాజీ MLA తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు RR ZP ఛైర్పర్సన్ తీగల అనిత, GHMC డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ లు సైతం కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఇప్పటికే వీరంతా సీఎం రేవంత్ ను కలవడం..పార్టీలో చేరే అంశంపై మాట్లాడడం జరిగింది.ఇక ఇప్పుడు అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు.

వీరు మాత్రమే కాదు బిఆర్ఎస్ లో ప్రస్తుతం ఎమ్మెల్యే లుగా కొనసాగుతున్న మరింత కొంతమంది కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీత చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు వినికిడి. అలాగే బొంతు రామ్మోహన్ సైతం మల్కాజిగిరి టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. మరి ఎవరికీ అధిష్టానం టికెట్ ఇస్తుందో చూడాలి.

Read Also : Koti Talambralu: అయోధ్య రాములోరి పెళ్లికి గోటి తలంబ్రాలు.. ఏకంగా అన్ని కేజీలు?