TS Cabinet Decisions: తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు

సీఎం కెసిఆర్ అధ్యక్షతన ఈ రోజు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం నూతన సచివాలయంలో దాదాపుగా మూడు గంటలకు పైగా జరిగింది.

TS Cabinet Decisions: సీఎం కెసిఆర్ అధ్యక్షతన ఈ రోజు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం నూతన సచివాలయంలో దాదాపుగా మూడు గంటలకు పైగా జరిగింది. ఈ స‌మావేశానికి మంత్రులు, సీఎస్ శాంతి కుమారితో పాటు ప‌లు శాఖ‌ల ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు. ఈ సమావేశంలో కీలక అంశాల‌పై చ‌ర్చించారు.

మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు:
. గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలను కాళేశ్వరం ప్రాజెక్టులతో లింక్
. హుస్సేన్ సాగర్ ను కాళేశ్వరంతో లింక్
. వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ
. కులవృత్తుల వారి కోసం నిర్ణయం. అందుకోసం మంత్రి గంగుల ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ..ఒక్కో లబ్ధిదారుడు రూ.లక్ష సాయం అందించే విధంగా నిర్ణయం
. నకిలీ విత్తనాలను సరఫరా చేసే వారిపై పీడీ యాక్టులు
. 111 జీవో ను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం
. తెలంగాణలో 38 డీఎంహెచ్ వో పోస్టులు మంజూరు
. కొత్తగా 40 మండలాల్లో పీహెచ్ సీలు మంజూరు
. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో పర్మినెంట్ ఉద్యోగులపై నిర్ణయం
. జైన్ కమ్యూనిటీని మైనార్టీ కమిషన్ పరిధిలోకి తీసుకురావటం. మొత్తం కమిషన్ లో 9 మంది సభ్యులు
. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బలోపేతం…కొత్తగా 10 పోస్టులు మంజూరుకు మంత్రివర్గం ఆమోదం
. వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని కేబినెట్ నిర్ణయం
. 15 రోజుల్లో రెండవ విడత గొర్రెలు పంపిణీ చేయాలని నిర్ణయం
. వనపర్తిలో జర్నలిస్టు భవనానికి పది గుంటల భూమి మంజూరు
. ఖమ్మంలో జర్నలిస్టుల ఇళ్ల కోసం 23 ఎకరాల భూమి మంజూరు
. రాష్ట్రంలో మక్కలు, జొన్నల కొనుగోలుకు కేబినెట్ నిర్ణయం
. కర్నెతండాకు ప్రైమరీ హెల్త్ సెంటర్ ను మంజూరు
. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను 21 రోజుల పాటు నిర్వమించాలని నిర్ణయం

Read More: NTR Statue: ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హై కోర్టు స్టే