Keshava Rao: కాంగ్రెస్‌పై కేకే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. సొంత ఇల్లు అంటూ కామెంట్స్‌..!

ఈ జంపింగ్ కార్య‌క్ర‌మం తొలుత తెలంగాణ‌లో మొద‌లుపెట్టింది బీఆర్ఎస్ మాజీ కీల‌క నేత కేకే (Keshava Rao)

  • Written By:
  • Updated On - July 4, 2024 / 09:07 PM IST

Keshava Rao: తెలంగాణ‌లో ప్ర‌స్తుతం రాజ‌కీయాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఇత‌ర పార్టీల నుండి అధికార పార్టీ కాంగ్రెస్‌లోకి జంపింగ్‌లు ఎక్కువ అయ్యాయి. త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీ కాంగ్రెస్‌లోకి సీఎం రేవంత్ స‌మ‌క్షంలో చేరుతున్నారు. ఈ క్ర‌మంలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువ శాతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ జంపింగ్ కార్య‌క్ర‌మం తొలుత తెలంగాణ‌లో మొద‌లుపెట్టింది బీఆర్ఎస్ మాజీ కీల‌క నేత కేకే (Keshava Rao). బీఆర్ఎస్ పార్టీలో అన్ని ప‌ద‌వులు అనుభ‌వించి చివ‌ర‌గా రాజ‌స‌భ్య ఎంపీగా ఉన్న కేకే త‌న కూతురు, హైద‌రాబాద్ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌లక్ష్మి కోసం కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కేకే త‌ర్వాత ప‌లువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేట‌ర్లు, కీల‌క నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా కేకే రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు గురువారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంత‌రం త‌న‌ రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌కు అంద‌జేసి స‌మావేశ‌మ‌య్యారు. అయితే కేకే అంత‌కంటే ముందే కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్‌గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా క‌ప్పుకున్నారు. అయితే రాజ్య‌స‌భ‌కు బీఆర్ఎస్ త‌ర‌పున ఎన్నికైన కేకే తాజాగా కాంగ్రెస్ పార్టీలోకి మార‌డంతో త‌న స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్న‌ట్లు మీడియాతో తెలిపారు. రాజ్య‌స‌భ స‌భ్యునిగా కేకేకు ఇంకా రెండేళ్ల ప‌ద‌వీకాలం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Also Read: PM Modi – CM Revanth : ప్రధాని వద్ద సీఎం రేవంత్ చర్చించిన అంశాలు ఇవే..

రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసి కేకే మీడియాతో మాట్లాడుతూ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ త‌న‌కు సొంత ఇల్లు లాంటిద‌న్నారు. నేను కాంగ్రెస్ మనిషిని.. ఇప్పుడు స్వేచ్చగా ఉన్నట్లు అనిపిస్తుంది. కాంగ్రెస్ ఎంపీలతోనే తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజస్వామ్యబద్దంగా ఉంది. ఆరు నెలల్లో ఎవరిని కూడా అంచనా వెయలేము. ఆరు నెలల్లో ప్రతి అభివృద్ధి కార్యక్రమం చూశా. ఫ్యామిలి పబ్లిసిటీ గత ప్రభుత్వంలో ఉన్న వారు చేశారు. ఆరు నెలలలో ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. నైతిక విలువలతో రాజీనామా చేశాను. రాజ్యసభ ఛైర్మన్ కూడా అదే చెప్పాను అని ఆయ‌న తెలిపారు.

We’re now on WhatsApp : Click to Join

అయితే కేకే చేరిక‌ను ఆహ్వానించిన సీఎం రేవంత్ కూడా ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేకే రాజీనామా విషయంలో పార్టీ అంతా కలిసి నిర్ణయం తీసుకున్న అంశమేన‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రానికి ఏది మంచో కేకే నిర్ణయం తీసుకుంటారు. కేకే సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని అన్నారు.