K. Keshava Rao : ఢిల్లీలో మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేసిన కేకే

తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్‌మున్షీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు

  • Written By:
  • Publish Date - July 3, 2024 / 05:20 PM IST

సీనియర్ రాజకీయ నేత, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు (K. Keshava Rao ) కాంగ్రెస్ (Congress) పార్టీ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆయన..సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్‌మున్షీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఖర్గే. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. బీఆర్ఎస్ హయాంలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అయితే కేసీఆర్ విధివిధానాలు నచ్చక ఆయన తిరిగి సొంతగూటికి వచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

బిఆర్ఎస్ పార్టీ లో కేకే కు కీలక బాధ్యత అప్పగించారు పార్టీ అధినేత కేసీఆర్. పార్టీ సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన ఆయన.. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేకేతో భేటీ అయ్యారు. అనంతరం కేకేతో పాటు ఆమె కుమార్తె హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి బీఆర్‌ఎస్‌ ను వీడారు. మే నెలలోనే విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరగా, ఈరోజు కేకే చేరారు.

కేశరావు 13 డిసెంబర్ 1940న వరంగల్‌లోని మహబూబాబాద్‌లో కె . నిరంజన్ రావు మరియు గోవిందమ్మ దంపతులకు జన్మించాడు. ఈయన బద్రుకా కళాశాల నుండి తన బి.కామ్ పొందాడు. తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క ఆర్ట్స్ కళాశాలలో MA మరియు తరువాత హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి PHD చదివాడు. అతనికి వసంత కుమారితో వివాహమై ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వరుసగా మూడు ప్రభుత్వాలలో క్యాబినెట్ మంత్రిగా విద్య, పరిశ్రమ మరియు కార్మిక వంటి ముఖ్యమైన శాఖల్లో పనిచేసారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుండి రెండు పర్యాయాలు శాసనమండలికి ఎన్నికయ్యాడు.

Read Also : Manchu Vishnu : కల్కిని చూశావా కన్నప్పా..?