K Keshava Rao: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కే. కేశవరావు..

కేబినెట్ హోదాతో ప్రజా వ్యవహారాల సలహాదారుగా కే కేశవరావును నియమిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది . వివిధ ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి సలహాదారుగా నియమించింది.

Published By: HashtagU Telugu Desk
K Keshava Rao

K Keshava Rao

K Keshava Rao: బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించారు కే కేశవరావు (K Keshava Rao). అంతే కాదు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలిగాడు. ఆ సాన్నిహిత్యంతో ఆయన కుమార్తె గద్వాల విజయలక్షిని హైదరాబాద్ మేయర్ పదవిని కట్టబెట్టారు. దీంతో వీరి మధ్య స్నేహం మరింత బలపడింది అనుకున్న తరుణంలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టడంతో ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ గూటికి క్యూ కట్టారు. అందులో కేకే ఫ్యామిలీ కూడా ఉంది. సీఎం రేవంత్ సమక్షంలో విజయలక్ష్మి కాంగ్రెస్ కండువా కప్పుకోగా తాజాగా కేకే ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కేకే కు సీఎం రేవంత్ రెడ్డి కీలక పదవి కేటాయించారు.

కేబినెట్ హోదాతో ప్రజా వ్యవహారాల సలహాదారుగా కే కేశవరావును నియమిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది . వివిధ ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి సలహాదారుగా నియమించింది. కేశ‌వ రావు ఇటీవ‌ల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ల‌న‌నే వార్త‌లు వ‌చ్చాయి. రాజకీయంగా మారడంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

Also Read: 24 Lakh Affected: వరదలతో వణుకు.. 24 లక్షల మందిపై ఎఫెక్ట్

  Last Updated: 06 Jul 2024, 04:47 PM IST