Kejriwal follows KCR: కేసీఆర్ ను ఫాలో అవుతున్న కేజ్రీవాల్.. ఢిల్లీలో ‘కంటి వెలుగు’

కేసీఆర్ చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేస్తామని అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) చెప్పారు.

Published By: HashtagU Telugu Desk
Kcr Arvind Kejriwal

Kcr Arvind Kejriwal

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ (Kejriwal) పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశ రాజధాని ఢిల్లీని మరింత డెవలప్ చేస్తున్నారు. ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ముందే ఉంటారు. ఇతర రాష్ట్రాల్లో ప్రజల కోసం అమలవుతున్న పథకాలకు ఆయన ఆకర్షితులవుతుంటారు. తాజాగా ఆయన (Kejriwal) తెలంగాణ ప్రభుత్వం (Telangana govt) అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం ఆకట్టుకుంది.

కేసీఆర్ చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేస్తామని ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal), భగవంత్ సింగ్ మాన్ తెలంగాణ పర్యటనలో చెప్పారు. నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బుధవారం ఖమ్మంలో ‘కంటి వెలుగు’ రెండవ దశ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ కాంప్లెక్స్ కాన్సెప్ట్‌ను ఢిల్లీలో కూడా అమలు చేస్తానని కేజ్రీవాల్ చెప్పారు. కేజ్రీవాల్, మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, BRS అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు, UP మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, CPI ప్రధాన కార్యదర్శి కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కేరళ ముఖ్యమంత్రి (Kerala Cm) కూడా కంటి వెలుగుపై ప్రశంసలు కురిపించారు. దేశంలో ఇంత పెద్దఎత్తున కంటి పరీక్ష శిబిరం నిర్వహించలేదని పినరయి అన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు కళ్లద్దాలు అందజేశారు. ఖమ్మం వెళ్లేముందు నేతలంతా ప్రగతి భవన్‌లో కేసీఆర్ (CM KCR) భేటీ అయ్యారు. అనంతరం రెండు హెలికాప్టర్ల ద్వారా లక్ష్మీనరసింహుని సమేతమైన యాదాద్రి ఆలయానికి చేరుకున్నారు. యాదాద్రి శిల్పకళా అద్భుతాన్ని సందర్శించిన నాయకులు ప్రశంసించారు. యాదాద్రి ప్రధాన అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే కేరళ సీఎం పినరయి, సిపిఐ నాయకుడు డి రాజా పూజలకు హాజరు కాలేదు.

Also Read: Sexual Harassment: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు.. ధర్నాలతో దద్దరిల్లిన ఢిల్లీ!

  Last Updated: 19 Jan 2023, 05:23 PM IST