Site icon HashtagU Telugu

Poor People Welfare: పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని.. అన్ని చదవగలరు

Keeping The Welfare Of Poor People In Mind.. All Can Read

Keeping The Welfare Of Poor People In Mind.. All Can Read

మంత్రి వర్గ నిర్ణయాల పట్ల హర్షం:

పేద ప్రజల (Poor People) దృష్టిలో వుంచుకుని కేసిఆర్ గారి నేతృత్వంలోని మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ హర్షించారు. సొంతింటి కలను నెరవేర్చడానికి ఇప్పటికే కొన్ని డబుల్ బెడ్రూం లు పంపిణీ చేయగా తాజాగా ఒక్కో నియోజకవర్గం లో 3000 మంది లబ్దిదారులకు 3 లక్షల రూపాయలు ఇప్పలని నిర్ణయించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే దళిత బందు తో ఇప్పటికే కొన్ని వందల కుటుంబాల్లో వెలుగులు నింపిన ప్రభుత్వం రెండో విడత దళిత బందును త్వరలో ప్రారంభించడం దళితుల అభ్యున్నతి KCR గారి ప్రభుత్వం ఎంతటి చిత్తశుద్దితో వుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ స్థలాంలో ఇల్లు కట్టుకున్నవారికి హక్కులు కల్పించడం కాశీ మరియు శబరిమలై యాత్రికులకు వసతికోసం నిధులు కేటాయించడాన్ని ఆయన స్వాగతించారు. పేద ప్రజల (Poor People) సంక్షేమమే లక్ష్యంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.

Also Read:  Artificial Intelligence: అసలుకు ఎసరు – AI మింగేసే జాబ్స్ ఇవే..