Telangana Politics: బండిని జైలు కు పంపడం కేసీఆర్ సక్సెస్సా? రాంగ్ స్టెప్పా?

కేసీఆర్ ని జైలుకు పంపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పలుమార్లు ప్రకటించారు. ఈ స్టేట్మెంట్ కి ఇరిటేటైన కేసీఆర్ బండి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

కేసీఆర్ ని జైలుకు పంపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పలుమార్లు ప్రకటించారు. ఈ స్టేట్మెంట్ కి ఇరిటేటైన కేసీఆర్ బండి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనని జైలుకు పంపేంత సీన్ బండికి లేదని, తన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని కేసీఆర్ బండికి సూచించారు. కేసీఆర్ ని జైలుకు పంపడం పక్కన పెడితే, కేసీఆర్ బండిని జైలుకు పంపారు.

ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించమని తెలిపిన కేసీఆర్ బండి విషయంలో పైచేయి సాధించాడని చెప్పవచ్చు. ఈ సంఘటన జరిగి 24 గంటలు గడవక ముందే బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేసారనే కారణంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.

కేసీఆర్ చర్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. బీజేపీని వెంటాడుతాం, వేటాడుతామని ప్రకటించిన కేసీఆర్ ఒక్కక్కరిని టార్గెట్ చేసి మరి రివెంజ్ తీసుకుంటున్నారని గులాబీ కార్యకర్తలు సంబరపడిపోతున్నారు. మరికొందరేమో ఇదంతా కేసీఆర్, బీజేపీ ఢిల్లీ నేతలు కలిసి ఆడుతున్న డ్రామా అని కొట్టిపారేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ని ప్రజలెవరూ పట్టించుకోకుండా బీజేపీని ప్రత్యామ్నాయంగా ఉంచేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు, బండి ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం వల్ల బండికి పేరొచ్చి ఈటెలను డమ్మీ చేయాలనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ ఇదంతా చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఏదేమైనా ఈ అంశం కేసీఆర్ కే తీవ్రనష్టంగా మారే అవకాశముంది. ఈ ఎపిసోడ్ అంతా కేసీఆర్ కావాలనే చేస్తుంటే అసలు ఫామ్ లోకి వస్తుందో రాదో తెలియని కాంగ్రెస్ పై భయంతో ఎదుగుతున్న బీజేపీ మరింత బెనిఫిట్ అయ్యేలా కేసీఆర్ తన సొంత పార్టీ భవిషత్తు రిస్క్ లో పెట్టినట్టే. లేదు కేసీఆర్ కి ఈ విషయంలో ఎలాంటి క్యాలిక్యులేషన్స్ లేకపోతే ఖచ్చితంగా బీజేపీ ట్రాప్ లో కేసీఆర్ ఇరుక్కున్నట్టుగానే భావించాలి.

ప్రతివిషయంలోనూ ఆచితూచి వ్యవహరించే కేసీఆర్ ఈ ఎపిసోడ్ కావాలని చేయిస్తున్నాడా? అనుకోకుండా జరుగుతోందా? అనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్న.