KCR Nephew: భూకబ్జా కేసులో కేసీఆర్ మేనల్లుడికి బిగ్ షాక్

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావుకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది కన్నారావు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.

KCR Nephew: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావుకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది కన్నారావు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.

ఆదిబట్ల పోలీస్ స్టేషన్‌లో తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కన్నారావు హైకోర్టును ఆశ్రయించారు. కన్నారావు వేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. కన్నారావు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు వెల్లడించారు. సంస్థ డైరెక్టర్ బండోజు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు రంగారెడ్డిలోని సర్వే నంబర్ 32/ఆర్‌యూయూలోని ఓఆర్‌ఎస్‌ ప్రాజెక్ట్స్‌ కంపెనీకి చెందిన రెండు ఎకరాల ప్రైవేట్‌ భూమిని కల్వకుంట్ల కన్నారావు ముఠా కబ్జా చేసేందుకు యత్నించినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మార్చి 3న ఉదయం 7 గంటలకు కన్నారావు 150 మంది దుండగులతో కలిసి తన భూమిలోకి చొరబడి ఫెన్సింగ్‌ను తొలగించి, సరిహద్దు రాళ్లను తొలగించి, భూమి చుట్టూ ఉన్న ఫ్రీకాస్ట్ గోడలను కూల్చివేసినట్లు బండోజు శ్రీనివాస్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Also Read: BRS : బిఆర్ఎస్ కు మరో దెబ్బ..