BJP : కేసీఆర్ చేసిన తప్పే..రేవంత్ చేస్తున్నాడు – బిజెపి

గతంలో మీరు చేసిందే కదా...మీము చేస్తుంది కొత్తగా మీము ఏంచేయడం లేదు అని సమాధానం చెపుతుంది

  • Written By:
  • Publish Date - June 27, 2024 / 12:42 PM IST

తెలంగాణ (Telangana) లో ఎన్నికల వేడి పూర్తి అయినప్పటికీ రాజకీయ వేడి మాత్రం తగ్గడం లేదు. బిఆర్ఎస్ పార్టీ (BRS) ఎమ్మెల్యేలను వరుసగా కాంగ్రెస్ (Congress) లో చేర్చుకోవడం ఫై బిఆర్ఎస్ తో పాటు బిజెపి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో కూడా 8 స్థానాలు సాధించింది. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ అసలు సింగిల్ ఖాతా కూడా తెరువకుండా చివరి స్థానానికి పడిపోయింది. అయినప్పటికీ కాంగ్రెస్..బిఆర్ఎస్ ను వదలడం లేదు. ఉన్న కొద్దీ మంది ఎమ్మెల్యేల ను కూడా తమ పార్టీలోకి ఆహ్వానిస్తుంది. ఇప్పటికే 5 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంది. మరికొద్ది రోజుల్లో ఉన్న వారు కూడా కాంగ్రెస్ లోకి వస్తారని పబ్లిక్ గా చెపుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇలా చేయడం తప్పని..మంత్రి పదవులు ఆశ చూపి పార్టీలోకి లాక్కోవడం ఏంటి అని బిఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. దీనికి కాంగ్రెస్ కూడా అంటే ఘాటుగా రిప్లయ్ ఇస్తుంది. గతంలో మీరు చేసిందే కదా…మీము చేస్తుంది కొత్తగా మీము ఏంచేయడం లేదు అని సమాధానం చెపుతుంది. ఇలా రెండు పార్టీల నేతల ఫిరాయింపుల ఫై బిజెపి (BJP) ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అధికార దాహంతో ఫిరాయింపులను ప్రోత్సహించడంలో నాడు బీఆర్ఎస్ అవలంబించిన విధానాన్నే నేడు కాంగ్రెస్ అనుసరిస్తోందని దుయ్యబట్టింది. ఈ రెండు పార్టీలు దొందు దొందే అని సెటైర్లు వేసింది. ఫిరాయింపు చట్టానికి నాడు కేసీఆర్ తూట్లు పొడిస్తే నేడు రేవంత్ రెడ్డి సేమ్ సీన్ రిపీట్ చేస్తున్నారని ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా విమర్శించింది. కరెక్టే కదా అని నెటిజన్లు బిజెపి కి సపోర్ట్ పలుకుతున్నారు.

Read Also : Sitarama Project : ట్రయల్ రన్ సక్సెస్..10 లక్షల ఎకరాలకు అందనున్న సాగు నీరు