కేసీఆర్ చేసిన ఆ తప్పే ..పార్టీ ఓటమికి కారణమైందా..?

ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేల ఫై ఓ కామెంట్ చేసారు.కొందరి ఎమ్మెల్యేల తీరు బాగాలేదని చెప్పిన కేసీఆర్

Published By: HashtagU Telugu Desk
KCR Injured

Will Kcr's Unexpected Strategies Work

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా దూసుకెళ్తుంది..మెజార్టీ స్థానాలకు మించి విజయం సాదించబోతున్నట్లు స్ఫష్టంగా తెలుస్తుంది. ఇక ఉదయం వరకు గెలుపు ధీమా వ్యక్తం చేసిన బిఆర్ఎస్ నేతలు ..ఫలితాలు చూసి ముఖం చూపించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు దాదాపు చాలావరకు ఓటమి చెందారు. అంతే కాదు బిఆర్ఎస్ పార్టీ ఇంత ఘోరంగా ఓటమి చెందడానికి కారణం కేసీఆర్ చేసిన ఆ తప్పే అని చాలామంది అభిప్రాయ పడుతున్నారు.

ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేల ఫై ఓ కామెంట్ చేసారు.కొందరి ఎమ్మెల్యేల తీరు బాగాలేదని చెప్పిన కేసీఆర్..తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ ఛాన్స్ ఇవ్వడం పార్టీ ఓటమికి కారణమైందని అర్ధం అవుతుంది. ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇవ్వకుండా కొత్త వారికీ ఛాన్స్ ఇస్తే తప్పకుండ గెలిచే వారని అంత అభిప్రాయపడుతున్నారు. ముందు నుండి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేల ఫై ఆయా నియోజకవర్గాలలో పూర్తి వ్యతిరేకత ఉంది. చాలామంది దీనిని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు..అయినప్పటికీ కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకోకుండా..మళ్లీ వారికే ఛాన్స్ ఇచ్చే సరికి ప్రజలు తమ కొపనాన్ని ఓటు రూపంలో చూపించారు.

Read Also : TS Elections: రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీచింది : పైలెట్ రోహిత్ రెడ్డి

  Last Updated: 03 Dec 2023, 02:32 PM IST