BJP Dilemma: కేసీఆర్ ‘ఖమ్మం’ సభ సక్సెస్.. బీజేపీకి దడ!

జాతీయ రాజకీయాలపై గురి పెట్టిన సీఎం కేసీఆర్ (CM KCR) ఖమ్మం సభతో తానేంటో చాటిచెప్పాడు.

  • Written By:
  • Updated On - January 19, 2023 / 12:13 PM IST

తెలంగాణలో (Telananga) బీఆర్ఎస్, బీజేపీ ‘నువ్వానేనా’ అన్నట్టుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సమయం వచ్చినప్పుడల్లా ఈ రెండు పార్టీలు తమ ఆధిపత్యం ప్రదర్శించుకునేలా పోటీ పోటా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నిక పోరులో ఈ రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా వ్యవహరించాయి. కేసీఆర్ (CM KCR) తన అధికార బలాన్ని ఉపయోగించి మునుగోడును కైవసం చేసుకుంటే, బీజేపీ సర్వశక్తులు ఒడ్డి తమ ఓటు బ్యాంకును పెంచుకొని బీఆర్ఎస్ కు సవాల్ విసిరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ (CM KCR) కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించిన ఖమ్మం సభ తెలుగు రాష్ట్రాలను కాకుండా దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసింది. నలుగురు సీఎంలు ఒకే వేదికను పంచుకోవడంతో బీజేపీలో గుబులు మొదలైంది.

బీఆర్ఎస్ లో జోష్

మేం ఢిల్లీకి, మోదీ ఇంటికి.. అంటూ ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ (CM KCR) చెబుతుంటూ జనం జయజయ ధ్వానాలు చేశారు. జై కేసీఆర్, జై తెలంగాణ, జై భారత్ నినాదాలతో ఖమ్మం సభా ప్రాంగణం మారుమోగిపోయింది. సభ అనుకున్నట్టుగా సక్సెస్ అయింది, గులాబీ దళం ఫుల్ ఖుషీ. అయితే ఇప్పుడు కాషాయదళంలో కంగారు మొదలైంది. తెలంగాణ సంగతి పక్కనపెడితే, ఢిల్లీ (Delhi) స్థాయిలో ఎంక్వయిరీలు మొదలయ్యాయి. ఖమ్మం సభ ఎందుకంత పెద్ద సక్సెస్ అయింది, తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నా జనం కేసీఆర్ వెంటే ఎందుకు ఉన్నారు. వరుసగా రెండు దఫాలు అధికారంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ పై కాస్తయినా వ్యతిరేకత ఎందుకు పెరగలేదనే కోణంలో బీజేపీ డైలమాలో పడినట్టు తెలుస్తోంది. అయితే సభ సక్సెస్ వెనుక జనసమీకరణ కూడా బలంగా పనిచేసిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆ నలుగురు

నలుగురు సీఎంలు (CM) ఒకే వేదికపై కలవడం అంటే మాటలు కాదు. ఖమ్మంలో తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు ఒకేవేదికపై మాట్లాడటం, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సహా జాతీయ పార్టీల కీలక నేతలు ఖమ్మం (Khammam) సభలో పాల్గొనడంతో జాతీయ మీడియా కూడా ఈ వ్యవహారంపై దృష్టిపెట్టింది. ఖమ్మం బీఆర్ఎస్ సభ జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఖమ్మం సభ జరిగిన వెంటనే కాంగ్రెస్ పై విమర్శలు చేశారంటూ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్లు ఇచ్చారు. కానీ బీజేపీ నాయకులు పెద్దగా రియాక్ట్ కాలేదు. బండి సంజయ్.. కొడుకు చేసిన రచ్చతో మీడియా ముందుకురాలేని పరిస్థితి ఉందని తెలుస్తోంది. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) మాత్రమే ఖమ్మం సభపై రియాక్ట్ అయ్యారు.

కిషన్ రెడ్డి రియాక్షన్

బీఆర్ఎస్ సహా ప్రతిపక్షాల తిట్లే ఆశీర్వాదంగా బీజేపీ (BJP) బలోపేతమవుతోందని వెల్లడించారు. బీజేపీని ఎంత తిడితే తెలంగాణ ప్రజలు అంత దగ్గరవుతారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తంగా ఖమ్మం సభలో కేసీఆర్ సహా హాజరైన నేతల ప్రసంగాలు కొండను తవ్వి తొండను పట్టినట్టుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్లు ప్రజలను కలవకుండా ఫాంహౌజ్‌కే పరిమితమైన కేసీఆర్ ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా అహర్నిశలు దేశం కోసం కృషి చేస్తున్న ప్రధాని మోదీ (PM Modi) గురించి మాట్లాడ్డం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని అన్నారు. కేసీఆర్ తానొక ముఖ్యమంత్రి అన్న విషయం మరచి దేశంపై విమర్శలు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.