Site icon HashtagU Telugu

BRS Public Meeting : ఏం పనిలేదా..అంటూ కార్యకర్తలపై కేసీఆర్ ఆగ్రహం

Kcr Fire

Kcr Fire

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)గా ప్రారంభమైన ప్రయాణం, భరత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారి నేడు 25 ఏళ్ల సుదీర్ఘ చరిత్రను రచించింది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ భారీ రజతోత్సవ సభను ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా కేసీఆర్ ముందుగా “జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి” అనే రామాయణ ఉదాహరణతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కాగా సభ ప్రారంభమైన కొద్ది సేపటికే వేదిక కింద నుండి అభిమానులు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తుండడం తో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. “ఏం సీఎంవయా.. పని లేదా?” అంటూ కార్యకర్తలపై మండిపడ్డారు. సభ పూర్తయ్యే వరకూ మౌనం పాటించాలని సూచించారు.

Mumbai Indians: లక్నోపై ముంబై ఘ‌న‌విజ‌యం.. బుమ్రా సరికొత్త రికార్డు!

ప్రసంగంలో కేసీఆర్ తన ఉద్యమ ప్రస్థానాన్ని భావోద్వేగంతో గుర్తు చేశారు. 25 సంవత్సరాల క్రితం గులాబీ జెండా ఎగురవేసి ఒక్కడిగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు న్యాయం చేయడానికే తాను రాజకీయ పదవులను త్యాగం చేసినట్లు స్పష్టం చేశారు. ఉద్యమం నుంచి వెనక్కి మళ్లినా, ప్రజల ఆశయాలను మరచినా రాళ్లతో కొట్టి చంపాలని అప్పట్లోనే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. పదవుల కోసం టీడీపీ, కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉన్నా, తాను మాత్రం ప్రజల కోసం పోరాడినట్లు వివరించారు.అలాగే కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణకు నెంబర్ వన్ శత్రువు కాంగ్రెస్ పార్టీనే అని పేర్కొన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన కారణంగా పీడించబడిన ప్రజల గోసను గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండున్నరేళ్ల సమయం మాత్రమే మిగిలిందని, ఈ కాలంలో వీరి మోసాలను ప్రజల ముందు విప్పి చెప్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ గర్వాన్ని కాపాడటానికి మళ్లీ ప్రజలు సిద్ధంగా ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.