Site icon HashtagU Telugu

Harish Rao: చావు నోట్లో తల పెట్టీ కేసీఆర్ తెలంగాణ సాధించారు: హరీశ్ రావు

Harish Rao

Harish Rao

Harish Rao: షాద్ నగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణ కోసం సిరిపురం యాదయ్య ప్రాణాలు త్యాగం చేసిన రోజు నేడు అని, ఎంతో మంది ఉద్యమకారుల పోరాట ఫలతం నేటి తెలంగాణ అని హరీశ్ రావు అన్నారు. చావు నోట్లో తల పెట్టీ కేసీఆర్ తెలంగాణ సాధించారని, తెలంగాణ అమరవీరులకు ఒక్క నాడు పువ్వు పెట్టని వ్యక్తి, ఒక్కనాడు జై తెలంగాణ అని వ్యక్తి సీఎం అయ్యాడని హరీశ్ రావు మండిపడ్డారు.

‘‘ షాద్ నగర్ ఉద్యమంలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంది. బి ఆర్ ఎస్ పార్టీకి కూడా అండగా ఉంది. మొన్న 7 వేల ఓట్లతో ఓడిపోయాం. కాంగ్రెస్ మోసపూరిత వాగ్ధానాలు నమ్మి ప్రజలు ఓటు వేశారు. గెలుపు ఓటములు ఉంటాయి. అధికారం, ప్రతిపక్షం అయినా మనం ప్రజల పక్షం ఉందాం. వారి వెంట పడి హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టం. కార్యకర్తలకు ఇబ్బంది ఉంటే ఒక్క ఫోన్ కొట్టండి గంట లో ఉంటం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చినం. ఏనాడు జై తెలంగాణ అని వారు కాంగ్రెస్ పార్టీ’’ హరీశ్ రావు అన్నారు.

‘‘ఆరులో 13 గ్యారెంటీలు ఉన్నాయి. రెండు అయిపోయాయని ప్రచారం చేసుకుంటున్నారు.18 ఏళ్లు నిండిన మహిళలు కోటి 50 లక్షల మంది ఉన్నారు. వారికి నెలకు 2500 ఇవ్వడం లేదు. బడ్జెట్ లో నిధులు పెట్టలేదు. గ్యారెంటీలు నమ్మాలని బాండ్ పేపర్లు రాసిచ్చారు. కానీ మోసం చేస్తున్నది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో హామీల పేరిట మోసం చేశారు. ప్రమాణ స్వీకారం మాత్రం త్వరగా చేశాడు, హామీల అమలు మాత్రం చేయడం లేదు. రైతులకు పంట బోనస్ ఇవ్వాల్సిందే. పార్లమెంట్ ఎన్నికల్లో మన రైతుల సత్తా చూపిద్దాం’’ హరీశ్ రావు అన్నారు.