Etala Rajender: గజ్వేల్‌లో డబ్బు, మద్యం పంపిణీ చేసి కేసీఆర్ గెలిచారు: ఈటల రాజేందర్

గురువారం గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తలతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు.

Published By: HashtagU Telugu Desk
Etala

Etala

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో ఓటమి తన సంకల్పానికి మరింత బలం చేకూర్చిందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. గురువారం గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈటల రాజేందర్ తన ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. గజ్వేల్‌లో డబ్బు, మద్యం పంచి మాజీ సీఎం కేసీఆర్ గెలిచారని ఆరోపించారు.

గజ్వేల్‌లో తక్కువ సమయంలో ఎక్కువ ఓట్లు వచ్చాయని, నైతికంగా గజ్వేల్‌లో బీజేపీ గెలిచిందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ప్రజలను నమ్మే నాయకుడు కాదని, స్థానిక నాయకులను భారీ మొత్తానికి కొనుగోలు చేసి గజ్వేల్‌లో కేసీఆర్ గెలిచారని ఆరోపించారు. విద్యార్థి దశ నుంచి తనకు ఓటమి తెలియదన్నారు.

గజ్వేల్‌లో ఓటమి తనకు మరింత బలాన్నిచ్చిందన్నారు రాజేందర్. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల టికెట్‌ దక్కించుకున్న ఈటెల రాజేందర్‌ రెండు చోట్లా ఓడిపోవడం గమనార్హం. గజ్వేల్‌లో మాజీ సీఎం కేసీఆర్ చేతిలో ఓడిపోయారు. హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

Also Read: Naa Saami Ranga: నా సామిరంగ మూవీ సర్ ప్రైజ్.. కీలక పాత్రలో అల్లరి నరేశ్

  Last Updated: 14 Dec 2023, 06:07 PM IST