CM KCR : మరో మూడు రోజులు ఢిల్లీలోనే కేసీఆర్…వెంటనే ఢిల్లీకి రావాలంటూ సీఎస్, డీజీపీలకు ఆదేశం..!!

తెలంగాణ సీఎం కేసీఆర్...ఢిల్లీకి వెళ్లి రేపటితో వారం రోజులు పూర్తి అవుతుంది. హస్తినాలో కేసీఆర్ ఏం చేస్తున్నారనే దానిపై ఎవరికీ అంతుపట్టడం లేదు.

  • Written By:
  • Updated On - October 17, 2022 / 07:07 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్…ఢిల్లీకి వెళ్లి రేపటితో వారం రోజులు పూర్తి అవుతుంది. హస్తినాలో కేసీఆర్ ఏం చేస్తున్నారనే దానిపై ఎవరికీ అంతుపట్టడం లేదు. మొత్తానికి ఏదో భారీ స్కెచ్ వేస్తున్నారన్న ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలను వెంటనే ఢిల్లీకి రావాలంటూ కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ మరో మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్నారట. పరిపాలన విషయాల గురించి చర్చించేందుకు అధికారులను ఢిల్లీకి పిలుపించుకున్నారన్న వార్తలు వస్తున్నాయి. సీఎం ఆదేశాలతో సీఎస్, డీజీపీతోపాటు పలువురు ముఖ్య అధికారులు ఢిల్లీలోకి బయలుదేరారు.ఈ మధ్య తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, ఇతర అంశాలపై వారితో కేసీఆర్ చర్చించనున్నారు.

మొత్తానికి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత ఢిల్లీకే పరిమితమయ్యారు. మునుగోడు ఉపఎన్నిక బాధ్యతను తన కుమారుడు కేటీఆర్ కు అప్పగించారు. తానే అంతాచూసుకోవాలని ఆదేశించారు. అయితే ఢిల్లీలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రముఖులతో చర్చిస్తున్నారని వార్తలు వస్తున్న్పప్పటికీ జాతీయ మీడియా కానీ…స్థానిక మీడియా కానీ పెద్దగా ఫోకస్ చేయడం లేదు. దీంతో పార్టీకి చెందిన పలువురు నాయకులు మాత్రమే కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నరన్న వార్తలను బయటకు లీక్ చేస్తున్నారు. నిన్న కాక మొన్న కేసీఆర్ హైదరాబాద్ టు ఢిల్లీ భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇవాళ రాష్ట్రానికి చెందిన ముఖ్య అధికారులను ఢిల్లీకి రప్పించుకున్నారు. మొత్తానికి ఢిల్లీలో ఏదో మతలాబు ఉందని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయి.