KTR: 6 నెలల్లోనే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు: కేటీఆర్

  • Written By:
  • Publish Date - May 6, 2024 / 11:37 PM IST

KTR: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మహేశ్వరంలో జరిగిన రోడ్ షో పాల్గొని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తే ప్రజలు నమ్మి మోసపోయారని, డిసెంబర్ 9 న రుణమాఫీ, బోనస్, కౌలు రైతులు, రైతు కూలీలకు పైసలు ఇస్తా అని రేవంత్ అన్నారని, బంగారం ఫ్రీ, రూ. 2500, ముసలోళ్లకు రూ. 4 వేలు అన్నాడు. తులం బంగారం అన్నాడు. అవన్నీ వస్తున్నాయా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే…రేవంత్ రెడ్డి తెర్లు తెర్లు చేసిండని అనిపిస్తోందా? అని, 10-12 సీట్లు మాకు అప్పగించండి. 6 నెలల్లోనే కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని కేటీఆర్ అన్నారు. మేం కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు అని,  మీరు మోసపోయి ఉండవచ్చని, కానీ ఇప్పుడు మనకు ఏమీ కోల్పోయామో అర్థమవుతోందని కేటీఆర్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

సీఎం రేవంత్ తెచ్చిన కంపెనీలకు కూడా కాపాడుత లేడు. ఇంకా కొత్త కంపెనీలు తెచ్చుడు ఆయనతోని అయితదా అని, లక్షన్నర తులాల బంగారం, మహిళలకు రూ. 12, 500 బాకీ ఉన్నాడు. ముసలోళ్లకు రూ. 4 వేలు ఏమో గానీ జనవరి నెల రూ. 2 వేలు ఎగగొట్టిండు అని కేటీఆర్ మండిపడ్డారుు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడుతా అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నాడని, వాళ్ల అహంకారం దిగిపోయేలా చేయాలంటే వారికి లోక్ సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలె అని కేటీఆర్ పిలుపునిచ్చారు.