K Annamalai: తెలంగాణలో ‘మహా’ సీన్.. కేసీఆర్ కూ ఉద్దవ్ ఠాక్రే గతి!

తెలంగాణ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకి కూడా అదే గతి పడుతుందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై  జోస్యం చెప్పారు.

  • Written By:
  • Publish Date - July 2, 2022 / 01:27 PM IST

తెలంగాణలో మహారాష్ట్ర సీన్ రిపీట్ అవుతుందని, తెలంగాణ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకి కూడా అదే గతి పడుతుందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై  జోస్యం చెప్పారు. ఆయన పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రాన్ని తన వ్యక్తిగత అవసరాల కోసం ఎటిఎమ్‌గా భావించే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీరుతో ప్రజలు టిఆర్‌ఎస్ పాలనపై విసుగు చెందారని అన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని సీఎం మరిచిపోయారని అన్నారు. “రాష్ట్రంలో వచ్చే ఎన్నికల తర్వాత (కేంద్రం, రాష్ట్రంలో బిజెపి) డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారాన్ని చేపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను ఓడించి,  తెలంగాణ ప్రజలకు సుపరిపాలన బీజేపీ అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తంది.

జూన్ 2, 3 తేదీల్లో జరిగే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ముందు రాజకీయ పరిస్థితులను అంచనా వేయడానికి రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్‌లకు తమ నేతలను పంపే వ్యూహంలో భాగంగా తమిళనాడు అధినేత నిజామాబాద్‌లో పర్యటించనున్నారు.  మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. సీఎం మాత్రమే నిర్ణయాలు తీసుకుంటే, వాటిని అధికారులు అమలు చేస్తున్నారని అన్నామలై అన్నారు.

“ముఖ్యమంత్రి ఇప్పటివరకు సచివాలయానికి వెళ్లలేదు. ఆయన పాలనలో సామాన్యులను కలవలేదు. నీళ్లు-నిధులు-నియమకాలు అనే లక్ష్యాలను ఆయన విస్మరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, అందులో ఎక్కువ భాగం మద్యం విక్రయాల ద్వారానే సమకూరుతున్నాయని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కోవాలంటే చంద్రశేఖర్ రావు భయపడుతున్నారని అన్నారు. మోడీ వచ్చినప్పడల్లా కేసీఆర్ తప్పించుకు తిరుగుతున్నారని అన్నారు.