Lok Sabha Elections : ఎంపీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చులకు రూ.95 ల‌క్ష‌ల చెక్‌ను ఇవ్వనున్న కేసీఆర్

ఎన్నికల ఖర్చులకు గాను ఒక్కక్కరికి రూ.95 లక్షలు ఇవ్వాలని చూస్తున్నారట. అంతే కాదు ఎన్నికల గెలుపు కోసం బస్సు యాత్ర కూడా చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారట

  • Written By:
  • Publish Date - April 16, 2024 / 04:30 PM IST

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS)..లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) గెలిచి తమ సత్తా చాటాలని చూస్తుంది. ఇందుకోసం పార్టీ అధినేత కేసీఆర్ (KCR)..తనదైన వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి..ప్రచారాన్ని ముమ్మరం చేసారు. ఇదే క్రమంలో ఈ నెల 18 న తెలంగాణ భవన్ లో ఎంపీ అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించి..ఎన్నికల ప్రచారం ఫై దిశానిర్దేశం చేసి ,వారికీ బీ ఫారాలు అందజేయాలని చూస్తున్నారు. అలాగే ఎన్నికల ఖర్చులకు గాను ఒక్కక్కరికి రూ.95 లక్షలు ఇవ్వాలని చూస్తున్నారట. అంతే కాదు ఎన్నికల గెలుపు కోసం బస్సు యాత్ర కూడా చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారట. దీనికి సంబదించిన రూట్ మ్యాప్ ను సిద్ధం చేయాలనీ పార్టీ నేతలకు సూచించారట. కాంగ్రెస్ తెచ్చిన కరువుకు అల్లాడుతున్న రాష్ట్ర రైతాంగం వద్దకు వెళ్లి వారి కష్ట సుఖాలను తెలుసుకొని, వారికి భరోసా ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం రాష్ట్రంలో బిఆర్ఎస్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఈ ఎన్నికల్లో మెరుగైన ఓట్లు, సీట్లు సాధించకపోతే రాష్ట్రంలో బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించుకోవడానికి బీజేపీ సిద్ధం గా ఉంది. అందుకే ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒకటి, రెండు సీట్లు కూడా రావని బీజేపీ, కాంగ్రెస్ నేతలు సవాళ్లు చేస్తూ వస్తున్నారు. ఇది గమనించే పార్టీ నేతలు కూడా నమ్మకం కోల్పోయి వరుసగా పార్టీకి రాజీనామా చేస్తూ వస్తున్నారు. అందుకే వీటిన్నింటిని అధిగమించి ఎన్నికల్లో గెలిచి తీరాలని అభ్యర్థులకు కేసీఆర్ సూచనలు తెలియజేస్తున్నారు. ప్రజల్లో నమ్మకం పెంచుకోవాలని , కాంగ్రెస్ ప్రభుత్వ హామీలపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకరావాలని ..కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని , పదేళ్లు అధికారంలో బిఆర్ఎస్ ఉన్నప్పుడు కరువు అనేది వచ్చిందా..? నీరు లేక ఉన్నామా..? ఎండాకాలంలో కూడా చెరువులు నిండుకుండలా ఉండేవి..కానీ ఇప్పుడు ఆలా ఉందా..? ఈ ప్రశ్నలన్నింటినీ ప్రజల ముందు ఉంచాలని కేసీఆర్ సూచిస్తున్నారట. ఇవే కాక ఎల్లుండి జరగబోయే సమావేశంలో మరికొన్ని ఐడియా లను షేర్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికి బిఆర్ఎస్ కు ఈ ఎన్నికలు చాల ముఖ్యం. ఈ ఫలితాలే పార్టీని మార్చబోతాయి. మరి ఏంజరుగుతుందో చూడాలి.

Read Also : ADR: లోక్‌సభ ఎన్నికలు..ఫేజ్ 2లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 21% మందిపై క్రిమినల్ కేసులు.. ఏడీఆర్ నివేదిక