Site icon HashtagU Telugu

KCR: నేడు సంగారెడ్డి జిల్లాలో ప్రజా ఆశీర్వాద సభ.. హాజరుకానున్న కేసీఆర్!

Kcr Nallagonda

Kcr Nallagonda

KCR: పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ శివారులో నేడు ప్రజా అశీర్వాద సభ ఉంది. సాయంత్రం 4గంటలకు ప్రారంభం అయ్యే ఈ సభకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్, జహీరాబాద్ ఎంపి అభ్యర్థులు వెంకట్ రామారెడ్డి, గాలి అనిల్ కుమార్, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొంటారు.

మెదక్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని పఠాన్ చెరు, సంగారెడ్డి, నర్సాపూర్…. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని జహీరాబాద్, అందోల్, నారాయణ్ ఖెడ్ అసెంబ్లీ నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలిరానున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని ఇప్పటికే పూర్తయ్యాయి. వేసవి దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు.

కాగా నిన్న జరిగిన సభలో సీఎం రేవంత్ కేసీఆర్ పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తన కుమార్తె కవితకు ఊరట కలిగించేందుకు ఐదు పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించేందుకు భారతీయ జనతా పార్టీతో కలిసి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుట్ర పన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం నారాయణపేట జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టైన తన కుమార్తె కవితను కాపాడుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీతో కేసీఆర్ రాజీ పడ్డారని ఆరోపించారు.