Site icon HashtagU Telugu

KCR Health Update : నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం..వాకర్ సాయంతో నడక

Kcr Walks With The Help Of

Kcr Walks With The Help Of

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR)..ఆరోగ్యం కుదుటపడుతుంది. గురువారం రాత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో కాలుజారి కింద పడడంతో ఆయన తుంటి ఎముక (KCR injures his hip after a fall) విరిగింది. దీంతో యశోద హాస్పటల్ వైద్య బృందం శుక్రవారం సాయంత్రం తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేసారు. శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్‌ సంపూర్ణంగా కోలుకోవడానికి 6-8 వారాల సమయం పడుతుందని డాక్టర్స్ వెల్లడించారు. ప్రస్తుతం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈరోజు ఆయన్ను వాకర్ సాయంతో నడిపించారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం కేసీఆర్‌ వెంట ఆయన సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్‌, కూతురు కవిత, మనుమడు హిమాన్షు, ఎంపీ సంతోశ్‌ కుమార్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. కేసీఆర్ హాస్పటల్ లో చేరిన దగ్గరి నుండి బిఆర్ఎస్ నేతలు , శ్రేణులతో పాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు సైతం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ వస్తున్నారు. అలాగే హాస్పటల్ కు కూడా చాలామంది నేతలు వచ్చి పలకరిస్తున్నారు. మరోపక్క పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

Read Also : T Congress : ‘చేయూత ‘, ‘మహాలక్ష్మి’ పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్